SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా అతను వేసిన ఒక మాస్టర్‌ప్లాన్.. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరువును నిలబెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌గా అతను వేసిన ఒక మాస్టర్‌ప్లాన్.. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరువును నిలబెట్టింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుతు బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించాడు. రోహిత్‌తో కలిసి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. కానీ, ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియా మంచి స్టార్ట్ లభించలేదు. జైస్వాల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. 10 బంతుల్లో 2 ఫోర్లతో 10 రన్స్ చేసి.. మార్క్ వుడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే రజత్ పాటిదార్ కూడా వికెట్ పారేసుకోవడంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రోహిత్ శర్మ తన మాస్టర్ మైండ్‌కు పనిచెప్పాడు. ఒక్క ఐడియా టీమిండియా పరువు నిలబెట్టాడు. ఆ ఐడియా ఏంటో.. పరువు ఎలా నిలబడిందో ఇప్పుడు చూద్దాం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. కేవలం 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్లు మార్క్ వుడ్ చెలరేగిపోతున్నాడు. మ్యాచ్ జరుగుతున్న తీరు చూస్తుంటే.. టీమిండియా ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోతుందేమో అనిపించింది. జట్టు మొత్తం యువ క్రికెటర్లతో నిండిపోవడంతో.. ఎవరిపై నమ్మకం పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ టైమ్‌లోనే రోహిత్ ఒక సూపర్ ప్లాన్ వేశాడు.. రతజ్ పాటిదార్ అవుటైన తర్వాత.. బ్యాటింగ్ ఆర్డర్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే సర్ఫరాజ్ ఖాన్‌ను ఆపేసి.. అతని స్థానంలో సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజాను రప్పించాడు. ఈ ఒక్క ఐడియా టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టడమే కాకుండా.. పరువూ కాపాడింది.
టీమిండియా ఆటగాళ్ల అనుభవం లేమిని ఇంగ్లండ్ బౌలర్లు అద్బుతంగా వినియోగించుకుని రెచ్చిపోతున్న తరుణంలో కాస్త ఓపికతో ఉంటే.. పరుగులు వస్తాయని భావించిన రోహిత్.. తనతో పాటు మరో ఎండ్‌లో వికెట్ కాపాడేందుకు తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ కంటే జడేజా అయితే బెటర్ అని అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పిలిచాడు. అది అద్భుత ఫలితాన్ని ఇచ్చింది. రోహిత్-జడేజా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే వారిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. ప్రస్తుతం రోహిత్ 77, జడేజా 48 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. తొలి మ్యాచ్ అడుతున్న యువ క్రికెటర్‌ను క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు రప్పించకుండా ఒక విధంగా సర్ఫరాజ్‌కు కూడా రోహిత్ హెల్ప్ చేశాడు. అదే విధంగా టీమిండియా ఇన్నింగ్స్‌ను కూడా అద్భుతంగా నిలబెట్టాడు. మరి జడేజాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు రప్పించిన రోహిత్ సూపర్ ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Captain Rohit Sharma 🤝 Ravindra Jadeja
1⃣0⃣0⃣-run partnership ✅
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ImRo45 | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/c4m4NNUEUG
— BCCI (@BCCI) February 15, 2024