SRH సూపర్‌ సక్సెస్‌ వెనుక రోహిత్‌ శర్మ ఆలోచన! ఇన్నాళ్లకు బయటపడింది!

Rohit Sharma, Sunrisers Hyderabad; ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటకు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ సక్సెస్‌ వెనుక రోహిత్‌ శర్మ ఆలోచన ఉందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆ ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Sunrisers Hyderabad; ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటకు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ సక్సెస్‌ వెనుక రోహిత్‌ శర్మ ఆలోచన ఉందన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఆ ఆలోచన ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదరగొడుతోంది. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటకి, ఈ సీజన్‌లో వాళ్లకి చాలా తేడా వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడుతున్న ఆట చూసి.. ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ రేంజ్‌లో ఉంది ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌. 11 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నా.. ఐపీఎల్‌లో అత్యధిక స్కోర్‌ రికార్డును ఈ ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లోనే సన్‌రైజర్స్‌ ఏకంగా మూడు సార్లు బ్రేక్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు.. వాళ్ల విధ్వంసం ఏ విధంగా సాగుతుందో. ఆర్సీబీ పేరిట ఉన్న 263 పరుగుల అత్యధిక స్కోర్‌ రికార్డును ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ సీజన్‌లోనే మూడు సార్లు దాటేసింది. ఐపీఎల్‌ హిస్టరీలోనే అత్యధిక పరుగులు 287 చేసిన టీమ్‌గా చరిత్ర సృష్టించింది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌లో ఇంత మార్పుకు కారణం ఏంటంటే.. వాళ్ల అప్రోచ్‌.

ఫస్ట్‌ బాల్‌ నుంచి దూకుడుగా ఆడాలనే వారి అప్రోచే వారిని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పవచ్చు. ఈ ఏడాది ఎస్‌ఆర్‌హెచ్‌కు కెప్టెన్‌గా ఎంపికైన ప్యాట్‌ కమిన్స్‌ కూడా లీగ్‌ ఆరంభంలో ఇదే చెప్పాడు. ఒక టీమ్‌గా మేం ప్రతి మ్యాచ్‌లో అగ్రెసివ్‌ స్టార్స్‌ను కొరుకుంటున్నాం అని. అదే ఎస్‌ఆర్‌హెచ్‌ ఓపెనర్లు చేసి చూపిస్తున్నారు. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌కు పవర్‌ప్లేలో మెరుపు వేగంతో పరుగులు చేపి పెడుతున్నారు. అయితే.. ఇదంతా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆలోచన నుంచి పుట్టిన స్ట్రాటజీ అని చాలా మందికి తెలిసి ఉండదు. అది ఎలాగంటే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో రోహిత్‌ శర్మ చెప్పింది, చేసి చూపించింది ఒక్కటే.. ఓపెనర్‌గా అగ్రెసివ్‌ స్టార్ట్‌ ఇస్తే.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండదు. 30 బంతుల్లో 50, 40 బంతుల్లో 80 పరుగులు ఇలా సాగింది వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ విధ్వంసం.. రోహిత్‌ ఇలా ఆడటంతోనే తర్వాత వచ్చే కోహ్లీపై ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేసి సూపర్‌ సక్సెస్‌ అయ్యారు. ఫైనల్‌ ఓటమి తప్పా.. ఆ వరల్డ్‌ కప్‌ టోర్నీలో రోహిత్‌ స్ట్రాటజీ సూపర్‌గా వర్క్‌ అవుట్‌ అయింది.

ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా రోహిత్‌ శర్మ ఆలోచననే ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు. ఓపెనర్లుగా వస్తున్న అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌.. ఫస్ట్‌ బాల్‌ నుంచి ప్రత్యర్థిపై విరుచుకుపడుతున్నారు. పవర్‌ ప్లేలో ఉండే ఫీల్డ్‌ రిస్టిక్షన్స్‌ను వాడుకుంటూ.. పరుగుల వదర పారిస్తున్నారు. దీంతో చాలా టీమ్స్‌ వారిని ఔట్‌ చేసే బదులు పరుగులు కాపాడుకునేందుకు డిఫెన్సివ్‌ బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో బరిలోకి దిగుతున్నాయి. పైగా 6 ఓవర్ల పవర్‌ ప్లేలోనే 80, 100 రన్స్‌ వచ్చేస్తుండటంతో తర్వాత వచ్చే క్లాసెన్‌ లాంటి విధ్వంస వీరులు మరింత చెలరేగి ఆడుతున్నారు. అందుకే ఎస్‌ఆర్‌హెచ్‌ 277, 287 లాంటి అతి భారీ స్కోర్లు చేసేందుకు వీలుంటుంది. మరి రోహిత్‌ ఆలోచనను ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుతంగా అమలు చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments