SNP
Rohit Sharma Century: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై సెంచరీతో చెలరేగాడు. ఇప్పటికే 3-1తో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో.. చివరిదైన నాలుగో టెస్టులో కూడా రోహిత్ బరిలోకి సూపర్ సెంచరీ బాదాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma Century: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై సెంచరీతో చెలరేగాడు. ఇప్పటికే 3-1తో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో.. చివరిదైన నాలుగో టెస్టులో కూడా రోహిత్ బరిలోకి సూపర్ సెంచరీ బాదాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. నిజానికి నామమాత్రమైన చివరి టెస్టులో రోహిత్ శర్మకు రెస్ట్ ఇస్తారని వార్తలు వచ్చినా.. యువ క్రికెటర్లతో నిండిన జట్టుకు తన అవసరాన్ని గుర్తించిన రోహిత్ శర్మ.. చివరి టెస్టు కూడా ఆడాలని ఫిక్స్ అయి బరిలోకి దిగాడు. మ్యాచ్ ఆడటమే కాకుండా ఇలా సెంచరీతో కదం తొక్కడంతో ఈ టెస్ట్ ఎంతో స్పెషల్‌గా మారింది. రోహిత్ శర్మతో పాటు ఈ మ్యాచ్‌లో యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ సైతం సెంచరీ సాధించాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ.. తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించాడు. జైస్వాల్ 58 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
ఒక వికెట్ నష్టానికి 135 పరుగుల వద్ద తొలి రోజు ఆటను ముగించిన టీమిండియా రెండో రోజు మరింత పట్టుబిగించింది. రోహిత్ శర్మ 154 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. రోహిత్ టెస్ట్ కెరీర్‌లో ఇది 12వ సెంచరీ. అలాగే శుబ్‌మన్ గిల్ సైతం 137 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ పూర్తి చేసుకున్నారు. గిల్‌కు ఇది ఐదో టెస్ట్ సెంచరీ. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 102, శుబ్‌మన్ గిల్ 101 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లంచ్ తర్వాత కూడా ఈ జోడి ఇదే విధంగా ఆడితే టీమిండియాకు భారీ స్కోర్ ఖాయంగా కనిపిస్తోంది. చాలా కాలంగా బిగ్ స్కోర్ కోసం ఎదురుచూస్తున్న రోహిత్, గిల్‌కు ఇది చక్కటి అవకాశం. ఇద్దరు భారీ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు మంచి ప్లాట్‌ఫామ్ సెట్ అయి ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బెన్ స్టోక్స్‌కు టీమిండియా స్పిన్నర్లు ఊహించని షాకిచ్చారు. ఆ జట్టును కేవలం 218 పరుగులకే కుప్పకూల్చారు. చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగగా, అశ్విన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. అలాగే జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ జాక్ క్రాలే ఒక్కడే 79 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయింది. వందో టెస్ట్ ఆడుతున్న బెయిర్ స్టో 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 29 పరుగులు చేసి వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, అదే ఊపులో అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Of hundreds and celebrations! 👏 🙌
Rohit Sharma 🤝 Shubman Gill
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ImRo45 | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/yTZQ4dAoEe
— BCCI (@BCCI) March 8, 2024
💯 for Rohit Sharma! 🙌
His 12th Test ton! 👏
Talk about leading from the front 👍 👍
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/LNofJNw048
— BCCI (@BCCI) March 8, 2024