iDreamPost

వీడియో: రోహిత్ పై కవ్వింపులు! అదిరే రిప్లయ్ ఇచ్చిన కోహ్లీ!

  • Author Soma Sekhar Published - 02:16 PM, Fri - 20 October 23

వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ స్పీడ్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే.. తాజాగా జరిగిన బంగ్లా మ్యాచ్ లో.. కోహ్లీ, రోహిత్ చేసిన ఓ పని అందరికీ సూపర్ కిక్ అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతుంది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ స్పీడ్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే.. తాజాగా జరిగిన బంగ్లా మ్యాచ్ లో.. కోహ్లీ, రోహిత్ చేసిన ఓ పని అందరికీ సూపర్ కిక్ అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

  • Author Soma Sekhar Published - 02:16 PM, Fri - 20 October 23
వీడియో: రోహిత్ పై కవ్వింపులు! అదిరే రిప్లయ్ ఇచ్చిన కోహ్లీ!

రోహిత్ శర్మ.. క్రీజ్ లో ఉంటే పెద్ద పులి మీద పడినట్లుగా ఉంటుంది ప్రత్యర్థి బౌలర్లకు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ.. ఆదిలోనే బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టడంలో సిద్దహస్తుడు హిట్ మ్యాన్. ఇక అవోకగా సిక్స్ లు బాదడంలో రోహిత్ శర్మ శైలి ప్రత్యేకమైనంది. మరి అలాంటి రోహిత్ శర్మను కవ్విస్తే ఊరుకుంటాడా.. తన బ్యాట్ పంజా రుచిచూపించకుండా మానడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తనకు కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో బంగ్లా బౌలర్ కు చూపించాడు. ప్రత్యర్థి బౌలర్ వేసిన డెడ్లీ బౌన్సర్ కు ఆ తర్వాత ఇచ్చిన కౌంటర్ ఎపిక్ అనే చెప్పాలి. ఇక రోహిత్ బ్యాట్ తో ఇచ్చిన సమాధానానికి విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించారు. ఎలాంటి తడబాటు లేకుండా ఇటు బౌలింగ్.. అటు బ్యాటింగ్ లో రాణించి.. జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. మరోసారి కింగ్ విరాట్ కోహ్లీ తన బ్యాట్ కు పనిచెప్పి.. 48వ శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ 11వ ఓవర్ లో ఇది జరిగింది. ఈ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు హసన్ మీరాజ్. అప్పటికే క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఇక ఈ ఓవర్ నాలుగో బంతిని డెడ్లీ బౌన్సర్ గా సంధించాడు హసన్. ఆ బాల్ సరాసరి రోహిత్ తల దగ్గర నుంచి వెళ్లడంతో రోహిత్ దానికి కొట్టలేకపోయాడు. ఇది చూసిన బంగ్లా బౌలింగ్ కోచ్ అలన్ డోనాల్డ్ చప్పట్లు కొట్టాడు.

అయితే ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఈ బౌన్సర్ సునామీ తెచ్చినట్లుగా అయ్యింది. ఇలా బౌన్సర్ వేసి బ్యాటర్ కు చిరాకు తెప్పించి, వికెట్ తీయాలని బౌలర్లు ప్లాన్స్ వేస్తుంటారు. కానీ ఓ సారథిగా రోహిత్ కు ఎంత సహనం ఉంటుందో.. పైగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హిట్ మ్యాన్ ఎంత కూల్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా.. ఆ తర్వాత బాల్ కు సేమ్ బౌన్సర్ వేయగా.. ఈసారి రోహిత్ తన మార్క్ షాట్ తో బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో విరాట్ కోహ్లీ డగౌట్ నుంచి చప్పట్లు కొడుతూ.. రోహిత్ ను ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ వరల్డ్ కప్ లో ఫుల్ బ్యాటింగ్ స్వింగ్ లో ఉన్న రోహిత్ ను ఇలా బౌన్సర్లతో కవ్విస్తే ఊరుకుంటాడా? రోహిత్ దెబ్బ అదుర్స్ కదూ.. అని ఈ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లతో 48 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. శుబ్ మన్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు 12 ఓవర్లలో 88 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఈ జోడీ అందించిన భాగస్వామ్యంతో.. విరాట్ మిగతా పనిని పూర్తి చేశాడు. ఇక రోహిత్ షాట్ కు కోహ్లీ క్లాప్స్ కొట్టడంతో ఇద్దరు అభిమానులు ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు. ఇది.. రోహిత్ మాస్ హిట్టింగ్ దెబ్బ అని కొంతమంది కామెంట్ చేయగా.., బంగ్లా కోచ్ క్లాప్స్ కి విరాట్ సరైన సమాధానం ఇచ్చాడని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి