SNP
Rohit Sharma, Mumbai Indians, Abhishek Nayar: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తనను తప్పించిన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి తనలోని బాధను వెల్లగక్కాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rohit Sharma, Mumbai Indians, Abhishek Nayar: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తనను తప్పించిన తర్వాత రోహిత్ శర్మ తొలిసారి తనలోని బాధను వెల్లగక్కాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించడంపై క్రికెట్ అభిమానులు ఎంత బాధపడ్డారో, ఆవేశపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోహిత్ ప్లేస్‌లో హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన వెంటనే.. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మంది ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో చేశారు. అలాగే ముంబై ఇండియన్స్ జెర్సీలను తగలబెడుతూ.. తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇంత వ్యతిరేకత వస్తుందని బహుషా ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఊహించి ఉండదు. రోహిత్‌కి అన్యాయం జరిగిందని.. ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్ హార్ధిక్ పాండ్యాను దారుణంగా ట్రోల్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలోనే ఓ టీమిండియా ఆటగాడు స్వదేశంలో ఈ రేంజ్‌లో ట్రోలింగ్‌కు గురి కావడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని, దేశం పరువుతీసిన వారి విషయంలో కూడా ఇంత వ్యతిరేకత వ్యక్తం కాలేదు. కానీ, రోహిత్ స్థానంలో పాండ్యా కెప్టెన్ అయ్యాడని అతన్ని ఘోరంగా ఆడుకున్నారు.
అయితే.. తనను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత రోహిత్ శర్మ ఎప్పుడూ ఓపెన్‌గా స్పందించలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఐపీఎల్ కంటే ముందు.. టీ20 వరల్డ్ కప్ 2024కి బాగా ప్రిపేర్ అవ్వడానికి ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరంగా ఉంటున్నట్లు రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి.. వెంటనే డిలీట్ చేసేశాడు. అంతకు మించి.. కెప్టెన్సీ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే.. తాజాగా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడుతూ రోహిత్ శర్మ తన మనసులోని బాధనంత వెల్లగక్కాడు. వారి సంభాషణలో రోహిత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తొలి వారి సంభాషణను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన కేకేఆర్.. వెంటనే దాన్ని డిలీట్ చేసింది. అయినా కూడా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రోహిత్ శర్మ, అభిషేక్ నాయర్ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. రోహిత్ మాట్లాడుతూ.. ‘ఒక్కో ఒక్కో విషయం మారుతోంది. అది వాళ్లపైన ఉంది.. నాకు ఎలాంటి ఫరక్ పడదు. నేను ఎక్కడికి వెళ్లను. ఏది ఏమైనా.. ఇది నా ఇళ్ల. ఆ టెంపుల్ నేను నిర్మించింది. నాకేంటి.. ఇదైతే నా లాస్ట్..’ అని రోహిత్ అన్నాడు. రోహిత్ మాటలను బట్టి చూస్తే.. తనను కెప్టెన్సీ నుంచి తప్పించి, పాండ్యాకు ఇవ్వడం, ముంబై ఇండియన్స్ టీమ్ ప్రదర్శన, నెక్ట్స్ ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడినట్లు అర్థం అవుతోంది. ముంబై ఇండియన్స్ టీమ్‌లో చాలా విషయాలు మారిపోయాయని, కెప్టెన్సీ మార్పు వల్ల టీమ్ ప్రదర్శనలో చెత్తగా ఉందని, అది వాళ్లు చేసుకుందని, దాంతో నాకేం కాదని అన్నాడు.
అలాగే నేను ముంబైని వదిలి వెళ్లను, అది నా ఇళ్లు. ముంబై అంటే ఇక్కడ ముంబై ఇండియన్స్ టీమ్‌కాదు.. రోహిత్ నివాసం ఉండేది ముంబైలోనే.. అందుకే రోహిత్‌కు ముంబై నుంచి భారీగా అభిమానులు ఉంటారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ నుంచి తనకు దక్కుతున్న అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎందుకంటే ముంబై నా ఇళ్లు అని రోహిత్ ఉద్దేశం. అలాగే ముంబై ఇండియన్స్ టీమ్ అంత స్ట్రాంగ్ అవ్వడానికి, ఐదు కప్పులు గెలవడానికి కారణం నేను, అది నేను సృష్టించిన సామ్రాజ్యం అని రోహిత్ చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్ చెత్త ప్రదర్శనపై మాట్లాడుతూ.. దాంతో నాకేం సంబంధం లేదు.. అయినా ఇది నా లాస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్‌లో అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. రోహిత్ శర్మలో ఇంత బాధ ఉందా అని ఫీల్ అవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
0:01 Ek ek chiz change ho raha hai,
0:04 Wo unke upar hai mujhe faraq nhi padta,
0:08 Mai to kahi jane nhi wala.
0:12 Jo bhi hai wo mera ghar hai bhai.
0:15 Jo temple maine banaya hai.
0:18 Muje kya ye to mera last h.Someone tell Rohit Sharma about fans. pic.twitter.com/LtvB6iMU73
— 𝐈conic𝗥ohit 𝕏 (@cap_x_mahesh) May 10, 2024