iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఇంగ్లండ్‌ ఎదురుదాడి! జైస్వాల్‌, KS భరత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన రోహిత్‌!

  • Published Jan 27, 2024 | 1:50 PM Updated Updated Jan 27, 2024 | 8:27 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. భారత యువ క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే.. రోహిత్‌ అలా ఎందుకు ప్రవర్తించాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. భారత యువ క్రికెటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే.. రోహిత్‌ అలా ఎందుకు ప్రవర్తించాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 27, 2024 | 1:50 PMUpdated Jan 27, 2024 | 8:27 PM
Rohit Sharma: ఇంగ్లండ్‌ ఎదురుదాడి! జైస్వాల్‌, KS భరత్‌కు వార్నింగ్‌ ఇచ్చిన రోహిత్‌!

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్ట్‌ హోరాహోరీగా సాగుతోంది. గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో ప్రస్తుతం మూడో రోజు కొనసాగుతోంది. ఇప్పటికైతే మ్యాచ్‌పై టీమిండియాదే పట్టులా కనిపిస్తోంది. అయితే.. ఆట మూడో రోజు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ మధ్యలో టీమిండియా యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, కేఎస్‌ భరత్‌లపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సీన్స్‌ క్రికెట్‌ అభిమానులను కంగారుపెడుతున్నాయి. అసలు ఎందుకు రోహిత్‌ శర్మ.. వాళ్లిద్దరిపై సీరియస్‌ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా టెస్ట్‌ మ్యాచ్‌ అంటే.. వికెట్ల కోసం సాగే వేట. ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయడంపై ఫోకస్‌ ఉంటుంది. అలాంటి సమయంలో ఫీల్డింగ్‌ చేసే జట్టులోని ప్లేయర్లంతా చాలా అలర్ట్‌గా ఉండాలి. చిన్న ఛాన్స్‌ దొరికినా.. అప్పీల్‌ చేస్తూ.. అంపైర్‌ నుంచి తమకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేసుకోవాలి. కానీ, ఇక్కడే భారత యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ భరత్‌ కాస్త డల్‌గా కనిపించారు రోహిత్‌ శర్మకు. వెంటనే వాళ్ళిద్దరినీ పిలిచి.. కాస్త గట్టిగానే చెప్పాడు. లెగ్‌ బిఫోర్‌ అవుట్ల కోసం గట్టిగా అప్పీల్‌ చేయాలని సూచించాడు. ఎందుకంటే.. వికెట్‌ కీపర్‌గా ఉన్న కేఎల్‌ భరత్‌, షార్ట్‌ లెగ్‌లో ఉన్న జైస్వాల్‌ బ్యాటర్‌కు చాలా దగ్గరగా ఉంటారు కనుక.. వాళ్లిద్దరూ కాన్ఫిడెంట్‌గా అప్పీల్‌ చేస్తేనే మిగతా వాళ్లు కూడా గట్టిగా అప్పీల్‌ చేస్తారు. దాంతో అంపైర్‌పై ఒత్తిడి వచ్చి.. మనకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంటుంది.

ఇదే విషయాన్ని రోహిత్‌ శర్మ.. యువ ఆటగాళ్లకు వివరించాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ను భారత ఆటగాళ్లు 246 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన భారత జట్టు.. 436 పరుగుల మంచి స్కోర్‌ చేసింది. జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలు హాఫ్‌ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్‌కు 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ దక్కింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌.. కాసేపు భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ, తర్వాత బుమ్రా చెలరేగడంతో.. మళ్లీ డిఫెన్సివ్‌ మూడ్‌లోకి వెళ్లింది. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ.. యువ ఆటగాళ్లపై సీరియస్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.