SNP
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ శర్మ పెను విధ్వంసం సృష్టించాడు. ఏకంగా సెంచరీతో చెలరేగి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ తీసుకున్న ఒక నిర్ణయం.. దేశంపై అతనికున్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్ శర్మ పెను విధ్వంసం సృష్టించాడు. ఏకంగా సెంచరీతో చెలరేగి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్ తీసుకున్న ఒక నిర్ణయం.. దేశంపై అతనికున్న ప్రేమకు నిదర్శనంగా నిలుస్తోంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. టీ20 క్రికెట్ ఆడతాడా? లేదా? టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేసిన వారి నోళ్లు మూయిస్తూ.. తన బ్యాటింగ్‌తో విళయతాండవం చేశాడు. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ సంచలన హిట్టింగ్‌తో దుమ్మరేపాడు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా ఇన్నింగ్స్‌ను తన భుజాలపై వేసుకుని.. ఏకంగా 200 పరుగుల మార్క్‌ను దాటించాడు. కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగులు చేసి.. తన టీ20 కెరీర్‌లో 5వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్ విజయంతో కెప్టెన్‌గా అత్యధిక టీ20 విజయాలు నమోదు చేశాడు.
కాగా, ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలవడంతో మూడో టీ20 నామమాత్రంగా మారింది. దీంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులు పెద్దగా ఆసక్తిచూపించలేదు. కానీ, మ్యాచ్ మాత్రం నభూతో నభవిష్యతి అనే రేంజ్‌లో సాగింది. హైస్కోరింగ్ గేమ్‌గా సాగిన ఈ మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో అంపైర్లు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ 16 రన్స్ చేసింది, బదులుగా ఇండియా కూడా సూపర్ ఓవర్‌లో 16 పరుగులు మాత్రమే చేయడంతో.. మ్యాచ్ మళ్లీ టై అయింది. దీంతో మళ్లీ సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. ఈ సారి భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 11 రన్స్ చేసింది. కానీ, ఆఫ్ఘాన్ ఒక్క పరుగు చేసి.. రెండు వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. అయితే.. తొలి సూపర్ ఓవర్‌లో జరిగిన ఒక సంఘటనతో రోహిత్ శర్మ గొప్పతనం ప్రపంచానికి తెలిసివచ్చింది. అదే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
తొలి సూపర్‌లో టీమిండియా 17 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది. రోహిత్-జైస్వాల్ జోడి క్రీజ్‌లోకి వచ్చింది. ఆఫ్ఘాన్ నుంచి ఒమర్‌జాయ్ బౌలింగ్ వేశాడు. తొలి రెండు బంతులకు కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కానీ, తర్వాత రెండు బంతులను రోహిత్ రెండు భారీ సిక్సులుగా మలిచాడు. ఇక రెండు బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే కావాలి. కానీ, ఐదో బంతికి ఒక్క రన్ మాత్రమే వచ్చింది. చివరి బంతికి రెండు రన్స్ కావాలి. స్ట్రైక్‌లో జైస్వాల్ ఉన్నాడు. రోహిత్ నాన్‌స్ట్రైకర్ ఎండ్ వైపు వచ్చేశాడు. అయితే.. చివరి బాల్‌కు రెండు పరుగులు పరిగెత్తాల్సిన సమయంలో రోహిత్.. రిటైర్డ్ అవుట్‌గా బయటికి వచ్చేశాడు. రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయంతో అంతా షాక్ అయ్యాడు.
చివరి బాల్‌కు రెండు రన్స్ అవసరమైన సమయంలో అప్పటికే 20 ఓవర్ల పాటు బ్యాటింగ్, 20 ఓవర్ల ఫీల్డింగ్ చేసి.. సూపర్ ఓవర్ ఆడి అలసిపోయి ఉన్న తనకంటే.. కొత్త బ్యాటర్ అయితే వేగంగా పరిగెత్తుతాడని చాలా తెలివిగా ఆలోచించి.. రోహిత్ రిటైర్డ్ అవుట్ అయ్యాడు. అతని స్థానంలో రింకూ క్రీజ్‌లోకి వచ్చాడు. కానీ, చివరి బాల్‌ను జైస్వాల్ సరిగా కనెక్ట్ చేయకపోవడంతో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. అది కూడా వికెట్ కీపర్ వేగంగా లేకపోవడంతో వచ్చింది. రింకూ చాలా వేగంగా స్ట్రైకింగ్ ఎండ్‌కు చేరుకున్నాడు. కానీ, అదే ప్లేస్‌లో రోహిత్ ఉండి ఉంటే.. ఆ ఒక్క రన్ కూడా వచ్చేదో లేదో.. ఎందుకంటే రోహిత్ అప్పటికే అలసిపోయి ఉన్నాడు. సో.. తాను బయటికి వెళ్లి రింకూను రప్పించడం రోహిత్ తీసుకున్న బెస్ట్ డిసిషన్.
అయితే.. ఇదే విషయంలో రోహిత్‌పై విమర్శలు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. సూపర్ ఓవర్‌లో రెండు పరుగులు అవసరమైన సమయంలో పరిగెత్తలేననే అనుమానంతో రిటైర్డ్ అవుట్ అయ్యాడు రోహిత్.. అంటే అతను ఫిట్‌గా లేడా? అనే అనుమానం కొంతమంది హేటర్స్ నుంచి రావచ్చు. కానీ, వాటిని అసలు లెక్కచేయడు రోహిత్. ఎందుకంటే రోహిత్‌కు వ్యక్తిగత రికార్డులు, తన పరువు కంటే కూడా దేశం గెలవడమే ముఖ్యం. అందుకే పరిగెత్తలేక వెళ్లిపోయాడు.. అనే అపవాదు వస్తుందని తెలిసినా.. జట్టు కోసం మంచి నిర్ణయం తీసుకున్నాడు. మరి రోహిత్ దేశం కోసం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి:
Rohit-Virat: రోహిత్, కోహ్లీలనే డకౌట్ చేశారు! ఇతన్ని ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయారు
Gulbadin Naib: చివరి T20లో భారత బౌలర్లను భయపెట్టాడు.. ఎవరీ గుల్బదీన్ నయీబ్?
Rohit Sharma 24(7) ball by ball
Super over against Afghanistan pic.twitter.com/XtILi7F7h6— Daily dose of Rohit Sharma batting (@Poetvanity_) January 18, 2024