iDreamPost
android-app
ios-app

వీడియో: అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన రోహిత్‌ శర్మ! ఫ్యాన్స్‌కు పండగే..

  • Published Jul 15, 2024 | 9:20 AM Updated Updated Jul 15, 2024 | 9:20 AM

Rohit Sharma, Team India: భారత క్రికెట్‌ అభిమానులకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన రోహిత్‌.. తాజాగా మరింత తీపి కబురు చెప్పాడు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Team India: భారత క్రికెట్‌ అభిమానులకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన రోహిత్‌.. తాజాగా మరింత తీపి కబురు చెప్పాడు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 15, 2024 | 9:20 AMUpdated Jul 15, 2024 | 9:20 AM
వీడియో: అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన రోహిత్‌ శర్మ! ఫ్యాన్స్‌కు పండగే..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఇటీవలె ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపి.. వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులను గర్వపడేలా చేసిన రోహిత్‌.. టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత.. అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచేందుకు క్రికెట్‌ అభిమానులు ఎంత సంతోష పడ్డారో అంతే బాధ కూడా పడ్డారు. వారి బాధకు కారణం.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడమే.

అయితే.. తన రిటైర్మెంట్‌తో బాధపడుతున్న వారికి రోహిత్‌ శర్మ తాజాగా గుడ్‌న్యూస్‌ చెప్పాడు. ఆదివారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్‌.. తాను మరింత కాలం క్రికెట్‌ ఆడతానంటూ తన అభిమానులకు తీపి కబురు చెప్పాడు. వయసు కారణంగా.. రోహిత్‌ శర్మ ఎక్కువకాలం క్రికెట్‌లో కొనసాగలేడని చాలా మంది క్రికెట్‌ నిపుణులు భావించారు. అతని రిటైర్మెంట్ గురించి చాలా రకాల వార్తలు కూడా వచ్చాయి. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడం, ఒక ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. రోహిత్‌కు టెస్టు, వన్డేల్లో ఎక్కువ కాలం ఆడే అవకాశం దక్కినట్లు అయింది.

రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లీ సైతం చాలా కాలం పాటే క్రికెట్‌ ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు ఆడి.. ఆ కప్పు సాధించి, అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు క్రికెట్‌ అభిమానులు. అలాగే రోహిత్‌ శర్మ కూడా 2027 వన్డే వరల్డ్‌ కప్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే తాను ఇప్పట్లో రిటైర్‌ కానని, నేను మరింత కాలం క్రికెట్‌ ఆడటం మీరంతా చూస్తారంటూ పేర్కొన్నాడు. తన కెరీర్‌పై రోహిత్‌ శర్మ ఇచ్చిన క్లారిటీతో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.