iDreamPost

Rohit Sharma: సచిన్‌ వీరాభిమానికి అదిరిపోయే సర్‌‍ప్రైజ్‌ ఇచ్చిన రోహిత్‌ శర్మ!

  • Published Jul 01, 2024 | 6:58 PMUpdated Jul 01, 2024 | 6:58 PM

Rohit Sharma, T20 World Cup 2024, Sudhir Kumar Chaudhary: టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత సచిన్‌ వీరాభిమానికి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. మరి ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఈ ప్రపంచంలో భారత జట్టు ఏ మూలన క్రికెట్‌ ఆడినా ఒక వ్యక్తి పెద్ద జాతీయ జెండా పట్టుకుని.. శంఖం ఊదుతూ.. ఛాతిపై టెండూల్కర్‌ 10 అని రాసుకుని.. జాతీయ జెండా రంగులు ఒంటినిండా పూసుకుని కనిపిస్తూ ఉంటాడు. ఏ స్టేడియంలో మ్యాచ్‌ జరిగినా అతను అక్కడ ఉంటాడు. టీమిండియా తన సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. జట్టు గట్టి సపోర్ట్‌ అందిస్తాడు. చాలా మంది క్రికెటర్‌ అభిమానులకు అతను సచిన్‌ వీరాభిమానిగా సుపరిచితుడే. అతని పేరు సుధీర్‌ కుమార్‌ చౌదరీ. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా అన్ని మ్యాచ్‌లకు హాజరయ్యాడు ఈ బిగెస్ట్‌ ఫ్యాన్‌.

అయితే.. టీమిండియా వరల్డ్‌ కప్‌ సాధించడంతో అతని సంతోషానికి హద్దులు లేవు. ఆ సంతోషాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెట్టింపు చేశాడు. సుధీర్‌ జీవితంలో మర్చిపోలేని విధంగా అతనికి అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. హరికేన్‌ తుఫాను వల్ల అన్ని విమాన సర్వీసులు నిలిచిపోవడంతో భారత క్రికెటర్లు అక్కడే ఉండిపోయారు. మ్యాచ్‌లు చూసేందుకు వెళ్లిన సుధీర్‌ కూడా అక్కడే ఉన్నాడు.

ఫైనల్‌ జరిగిన తర్వాతి రోజు వరల్డ్‌ కప్‌ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు టీమిండియా క్రికెటర్లు. ఆ సమయంలోనే రోహిత్‌ శర్మ సుధీర్‌ను పిలిపించి.. అతని చేతికి టీ20 వరల్డ్‌ కప్‌ ట్రోఫీని అందించాడు. ఊహించని ఈ ఘటనతో సుధీర్‌ షాక్‌ అయ్యాడు. తాను సచిన్‌ టెండూల్కర్‌కు వీరాభిమాని అయినా.. టీమిండియాకు అందిస్తున్న సపోర్ట్‌ గుర్తించి.. రోహిత్‌ శర్మ తనను పిలిపించి మరీ టీ20 వరల్డ్‌ కప్‌ ఇచ్చి ఫొటోలు దింపించడంతో అతను ఫుల్‌ ఖుషీ అయ్యాడు. టీమిండియా బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌కు రోహిత్‌ ఇచ్చిన గౌరవంపై క్రికెట్‌ అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి