SNP
Rohit Sharma: ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా.. పవర్ ప్లేలో ఎటాకింగ్ గేమ్‌తో అదరగొట్టే రోహిత్ శర్మ.. ఓ బౌలర్‌ను ఎదుర్కొడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ విషయం రోహిత్ మాట్లాల్లోనే ఇలా అన్నాడు..
Rohit Sharma: ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా.. పవర్ ప్లేలో ఎటాకింగ్ గేమ్‌తో అదరగొట్టే రోహిత్ శర్మ.. ఓ బౌలర్‌ను ఎదుర్కొడానికి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ విషయం రోహిత్ మాట్లాల్లోనే ఇలా అన్నాడు..
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీ20 వరల్డ్ కప్ 2024 కంటే ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఆటగాడి వీడియోలు చూసి బ్యాటింగ్‌కు వెళ్లేవాడినని.. అయినా కూడా అతని ముందు తనకు అంత మంచి రికార్డ్ లేదని తెలిపాడు. ఇంతకీ రోహిత్ శర్మ ఎవరి గురించి మాట్లాడాడు అని ఆలోచిస్తున్నారా? రోహిత్ చెప్పాడంటే.. అతను కచ్చితంగా లెజెండ్ క్రికెటర్ అయి ఉంటాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు రోహిత్ శర్మ చెప్పింది.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, దిగ్గజ బౌలర్ డేల్ స్టెయిన్ గురించి.
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నేను బ్యాటింగ్‌కు వెళ్లే ముందు డేల్ స్టెయిన్ వీడియోలను 100 సార్లు చూశాను. అతను ఒక లెజెండ్, అతను ఎంతో సాధించాడు. స్టెయిన్‌కు వ్యతిరేకంగా నాకు అంత మంచి రికార్డు లేదు. అయినా కూడా అతని బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం బాగుంటుంది. అతనితో యుద్ధాన్ని ఆస్వాదించాను’ అని రోహిత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ దిగ్గజ ప్లేయర్‌ను మరో స్టార్ ప్లేయర్ ఇలా ఆకాశానికెత్తేయడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2013 నుంచి 2018 వరకు టెస్టుల్లో ఓవరాల్‌గా డేల్ స్టెయిన్ వేసిన 41 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 17 పరుగులు చేసి.. ఒక్కసారి అవుట్ అయ్యాడు. అలాగే వన్డేల్లో 2010 నుంచి 2015 మధ్యలో 117 బంతులు ఆడి 74 రన్స్ చేశాడు. టీ20ల్లో 2014లో 4 బంతుల్లో 7 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో 2008 నుంచి 2014 వరకు 46 బంతులాడి 37 పరుగుల చేశాడు. ఒక సారి అవుట్ చేశాడు. ఓవరాల్‌గా రోహిత్ శర్మపై డేల్ స్టెయిన్‌దే పైచేయిగా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా రోహిత్ శర్మనే ఒప్పుకోవడం విశేషం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma said, “I had watched Dale Steyn’s videos 100 times before I went to bat. He is a legend and what he has achieved is just superb to watch. It was nice to come up against him, not that I had huge success against him, but I enjoyed my battle”. (Dubai Eye 103.8 YT). pic.twitter.com/Hp0Q7uIUIV
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 15, 2024