Nidhan
Rohit Sharma, T20 World Cup 2024, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటూనే మధ్యలో కొన్ని ఈవెంట్స్‌కు అటెండ్ అవుతున్నాడు.
Rohit Sharma, T20 World Cup 2024, Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటూనే మధ్యలో కొన్ని ఈవెంట్స్‌కు అటెండ్ అవుతున్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, తన చుట్టూ ఉన్నవారిని కూడా సరదాగా నవ్విస్తూ ఉంటాడు. గ్రౌండ్‌తో పాటు బయట కూడా అతడి వ్యక్తిత్వంలో మార్పు ఉండదు. యంగ్‌స్టర్స్, సీనియర్స్ అనే తేడాల్లేకుండా అందరితోనూ కలసిపోయే హిట్‌మ్యాన్.. చూడటానికి ఫన్నీగా కనిపిస్తాడు. బ్యాటింగ్, కెప్టెన్సీ.. క్యాజువల్‌గా చేస్తున్నట్లే అనిపిస్తుంది. పెద్దగా ఎఫర్ట్ పెడుతున్నట్లు ఉండదు. కానీ ఆ సమయంలో తన మైండ్ ఎలా పని చేస్తుందో రోహిత్ రివీల్ చేశాడు. తన మెదడు చాలా షార్ప్‌గా వర్క్ చేస్తుందని తెలిపాడు. తాను ఏది చెబితే అదే జరుగుతుందని, అది తన మాట వినక తప్పదన్నాడు. ఆన్ ది ఫీల్డ్ తన మైండ్‌ను ఎలా ఆపరేట్ చేస్తాననేది ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పాడు రోహిత్. అతడు ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
‘అంతా మైండ్ మీదే ఆధారపడి ఉంది. దాని కంటే పవర్ఫుల్ ఏదీ లేదు. మనం మెదడుకు ఏం చెబితే అదే జరుగుతుంది. దాన్ని మనం ఎలా ట్రైన్ చేస్తామో అది అలాగే పని చేస్తుంది. మనం చెప్పిందే అది చేస్తుంది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. హిట్‌మ్యాన్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు లేకపోవడంతో విశ్రాంతి తీసుకుంటూనే మధ్యలో కొన్ని ఈవెంట్స్‌కు అటెండ్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ అవార్డు ఫంక్షన్‌కు అటెండ్ అయిన రోహిత్‌కు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది. ఎన్నో ఏళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు, కెరీర్లో ఎత్తుపళ్లాలు చూశారు, ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారు.. ఈ స్టేజ్‌లో మీ బెస్ట్ ఇవ్వడానికి ఏం చేస్తారనే ప్రశ్నకు రోహిత్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. ఏదైనా మెదడు మీదే డిపెండ్ అవుతుందని, దాన్ని ఎలా ట్రైన్ చేస్తామనేది చాలా ముఖ్యమని తెలిపాడు.
దేశానికి వరల్డ్ కప్ అందివ్వడం అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందన్నాడు రోహిత్. ఇది ప్రతి రోజూ వచ్చే ఫీలింగ్ కాదని.. అందుకే ఆ మూమెంట్స్‌ను అభిమానులందరితో కలసి సెలబ్రేట్ చేసుకున్నామని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. తమతో కలసి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఫ్యాన్స్‌కు అతడు థ్యాంక్స్ చెప్పాడు. ఇక, ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్న భారత కెప్టెన్ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద కూడా వర్క్ చేస్తున్నాడు. అయితే రోహిత్‌ను యాక్షన్‌లోకి చూడాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది. దులీప్ ట్రోఫీ-2024లో అతడ్ని ఆడిస్తారనుకుంటే మరింత రెస్ట్ ఇవ్వాలనే కారణంతో సెలెక్ట్ చేయలేదు. కాబట్టి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తోనే హిట్‌మ్యాన్ మళ్లీ బరిలోకి దిగుతాడు. మరి.. మైండ్ కంటే పవర్ఫుల్ ఏదీ లేదంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Captain Rohit Sharma talking about the feeling after winning T20 World Cup.❤️
– THE CAPTAIN, ROHIT…!!!! 🐐pic.twitter.com/utoYMbKssl
— Tanuj Singh (@ImTanujSingh) September 3, 2024