ప్రతి వ్యక్తికి ఓ కల ఉంటుంది. ఆ వ్యక్తి సెలబ్రిటీ అయినా, రాజకీయ నాయకుడు అయినా ఎవరైనా కాని. నాకూ అలాంటి డ్రీమే ఉందంటున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే ఆ డ్రీమ్ ను నేను బ్రేక్ చేస్తానని నా కలలో కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ అయిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడమే నా కల అంటూ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. మరి ఇంతకీ గేల్ నెలకొల్పిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ క్రికెట్ లో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ఎన్నో రికార్డులు సాధించాడు. ప్రస్తుతం అతడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా గానీ అతడు నెలకొల్పిన పలు రికార్డులు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆ రికార్డులో అత్యధిక సిక్సుల రికార్డు కూడా ఒకటి. గేల్ తన అంతర్జాతీయ కెరీర్ లో 553 సిక్స్ లు బాది.. ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 539 సిక్స్ లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో మరో 14 సిక్సర్లు బాదితే గేల్ రికార్డు బద్దలవ్వడం ఖాయం. ఇదే విషయాన్ని రోహిత్ కూడా చెప్పుకొచ్చాడు.
గేల్ అత్యధిక సిక్సుల రికార్డును బద్దలు కొట్టడమే నా కల, అయితే అతడి రికార్డును బద్దలు కొడతానని నేను నా జీవితంలో కూడా ఊహించలేదని రోహిత్ శర్మ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో చెప్పుకొచ్చాడు. వీరిద్దరి తర్వాత పాక్ స్టార్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది 476 సిక్సులు బాది మూడో ప్లేస్ లో ఉన్నాడు. కాగా.. ఆసియా కప్, వరల్డ్ కప్ లో గేల్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. మరి గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rohit Sharma has expressed his ambition to surpass Chris Gayle’s record for most sixes in International cricket pic.twitter.com/4dJ9fRVbTF
— CricTracker (@Cricketracker) September 8, 2023