iDreamPost
android-app
ios-app

శుబ్ మన్ గిల్ ఫ్యాన్స్ గొప్ప మనసు! వైరలవుతున్న వీడియో..

  • Author Soma Sekhar Published - 04:33 PM, Fri - 8 September 23
  • Author Soma Sekhar Published - 04:33 PM, Fri - 8 September 23
శుబ్ మన్ గిల్ ఫ్యాన్స్ గొప్ప మనసు! వైరలవుతున్న వీడియో..

చేసే సాయం చిన్నదే కావొచ్చు.. కానీ ఆ సాయం అవతలివారి కడుపు నింపితే, అదే పెద్ద సాయం అవుతుంది. ఇక సెలబ్రిటీలు, రాజకీయనాకుల పుట్టినరోజు నాడు వారి ఫ్యాన్స్ వివిధ కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లకు భోజనం, వస్త్రాల పంపిణి లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంటారు. తాజాగా తన 24వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్ మన్ గిల్. ఈ నేపథ్యంలో గిల్ ఫ్యాన్స్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శుబ్ మన్ గిల్.. 2019లో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాతి సంవత్సరమే టెస్ట్, టీ20ల్లోకి కూడా దూసుకొచ్చాడు. అద్భుతమైన ఆటతీరుతో అతి తక్కువ కాలంలోనే టీమిండియాలో కీలక ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యువ ఆటగాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 8వ తారీఖున తన 24వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాడు ఈ యువ సంచలనం. కాగా.. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ 2023లో చోటు దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు.

ఇక గిల్ పుట్టినరోజును పురస్కరించుకుని అతడి ఫ్యాన్స్ రోడ్డుపై ఉన్న అనాథ పిల్లలకు ఫుడ్ అందించారు. వారితో కలిసి కేట్ కట్ చేసి గిల్ పై తమకు ఉన్న అభిమానాన్ని చూపించారు. రోడ్డుపై ఆకలితో ఉన్న పిల్లలకు ఫుడ్ ప్యాకెట్స్ ను అందించారు గిల్ ఫ్యాన్స్. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గిల్ ఫ్యాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఇక టీమిండియాలోకి వచ్చిన గిల్ వస్తూ వస్తూనే తనపేరిట పలు రికార్డులను సృష్టించుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో తొలి డబుల్ సెంచరీ సాధించి.. ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో పాటుగా మరెన్నో రికార్డులు బద్దలు కొట్టాడు గిల్. మరి గిల్ పుట్టినరోజు నాడు అతడి ఫ్యాన్స్ చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet