iDreamPost

Rohit Sharma: ఆసీస్ పై విజయం.. దాని గురించి అస్సలు థింక్ చేయలేదు! రోహిత్ ఊహించని కామెంట్స్..

ఆస్ట్రేలియాపై సాధించిన అద్భుత విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఆస్ట్రేలియాపై సాధించిన అద్భుత విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఊహించని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Rohit Sharma: ఆసీస్ పై విజయం.. దాని గురించి అస్సలు థింక్ చేయలేదు! రోహిత్ ఊహించని కామెంట్స్..

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సూపర్ 8లో ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఆ జట్టు సెమీస్ ఆశలను కొల్లగొట్టింది. ఇక ఇప్పుడు ఆసీస్ సెమీస్ ఛాన్స్ బంగ్లా-ఆఫ్గాన్ మ్యాచ్ పై ఆధారపడింది. ఇక ఈ మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఊహించని కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. ఆసీస్ తో జరిగిన సూపర్ 8 చివరి మ్యాచ్ లో 24 రన్స్ తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ 41 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో 92 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. అనంతరం 206 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కాగా.. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన హిట్ మ్యాన్ ఊహించని కామెంట్స్ చేశాడు.

“నేను మెుదటి నుంచి ఇలాగే ఆడాలని అనుకుంటాను. ఇంతకు ముందు కూడా చెప్పాను. దూకుడుగా ఆడాలంటే బౌలర్లపై ఒత్తిడి తేవాల్సిందే. అప్పుడే వారు ఆత్మరక్షణలో పడతారు. దాన్నే నేను అన్ని గేముల్లో అప్లై చేయాలనుకుంటాను. అయితే ఈ క్రమంలో నేను సెంచరీ గురించి ఆలోచించలేదు. అస్సలు అది నా మైండ్ లోనే లేదు. వ్యక్తిగత రికార్డుల గురించి నేనెప్పుడు పట్టించుకోను. జట్టు విజయమే నాకు ముఖ్యం” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఏ ఆటగాడికైనా సెంచరీ అనేది ఓ ఎమోషనల్. దాంతో 90 పరుగులు చేసిన తర్వాత సెంచరీ కోసం చూస్తారు. కానీ నేను అలాంటి వాడిని కాదని రోహిత్ చెప్పుకొచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి