Rohit Sharma: అందుకే పిచ్ పై మట్టి తిన్నా.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన రోహిత్!

ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్ పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు రోహిత్ శర్మ. ఆ మట్టి తినడానికి కారణం తాజాగా వెల్లడించాడు. ఇంతకీ రోహిత్ ఏం చెప్పాడంటే?

ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్ పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు రోహిత్ శర్మ. ఆ మట్టి తినడానికి కారణం తాజాగా వెల్లడించాడు. ఇంతకీ రోహిత్ ఏం చెప్పాడంటే?

రోహిత్ శర్మ.. తన అద్భుతమైన కెప్టెన్సీతో టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ ను అందించాడు. టోర్నీ ప్రారంభం నుంచి పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వచ్చాడు. ప్లేయర్లకు స్వేచ్చను ఇస్తూ.. వారిని పరిస్థితులకు తగ్గట్లుగా వాడుకుంటూ.. విజయవంతమైన నాయకుడిగా ప్రశంసలు అందుకుంటూ ఉన్నాడు. కాగా.. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హిట్ మ్యాన్ చేసిన ఓ పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బార్బడోస్ పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు రోహిత్. ఆ మట్టి తినడానికి కారణం తాజాగా వెల్లడించాడు.

గొప్ప గొప్ప టోర్నీల్లో గెలిచినప్పుడు కెప్టెన్లు చేసే కొన్ని కొన్ని పనులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన పని నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచ కప్ ను అందుకున్న తర్వాత బార్బడోస్ పిచ్ పై ఉన్న మట్టిని నోట్లో వేసుకున్నాడు హిట్ మ్యాన్. దాంతో అతడు పిచ్ పై మట్టిని ఎందుకు తిన్నాడు? అన్న ప్రశ్న అందరిలో ఆసక్తిని రేపింది. ఆ ప్రశ్నకు తాజాగా సమాధానం ఇచ్చాడు రోహిత్.

“బార్బడోస్ పిచ్ పైనే మేము ఫైనల్ గెలిచి.. వరల్డ్ కప్ సాధించాం. నా కెరీర్ లో ఇదొ గొప్ప మధురక్షణం. ఇది నా లైఫ్ లాంగ్ గుర్తుకు ఉంటుంది. ఈ విజయాన్ని నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే అలా పిచ్ పై ఉన్న మట్టిని నోట్లో వేసుకున్నాను” అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్. కాగా.. ఈ మెగాటోర్నీలో కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా రాణించాడు. ఈ వరల్డ్ కప్ లో 257 పరుగులు సాధించాడు రోహిత్ శర్మ. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం టీ20లకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మరి పిచ్ పై ఉన్న మట్టిని రోహిత్ శర్మ తినడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments