iDreamPost
android-app
ios-app

ఆ టీమిండియా ప్లేయర్ ఒక అద్భుతం.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్: టీమిండియా మాజీ క్రికెటర్

  • Published Jul 02, 2024 | 11:19 AM Updated Updated Jul 02, 2024 | 11:19 AM

ఆ టీమిండియా క్రికెటర్ ఓ అద్భుతం అని, అతడు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అని ప్రశంసల్లో ముంచెత్తాడు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఆ టీమిండియా క్రికెటర్ ఓ అద్భుతం అని, అతడు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అని ప్రశంసల్లో ముంచెత్తాడు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. మరి ఆ ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

ఆ టీమిండియా ప్లేయర్ ఒక అద్భుతం.. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్: టీమిండియా మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచ కప్ ను గెలిచి.. వరల్డ్ ఛాంపియన్స్ గా అవతరించింది టీమిండియా. దాంతో తన 13 ఏళ్ల వరల్డ్ కప్ కలను నెరవేర్చుకుంది. ఇక ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది టీమిండియా. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ప్రపంచ కప్ ను ముద్దాడింది. వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న భారత ఆటగాళ్లపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీమిండియా ప్లేయర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా. ఆ ఆటగాడు 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అంటూ కితాబిచ్చాడు.

పొట్టి ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న టీమిండియా ప్లేయర్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు భారత ఆటగాళ్లపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ జాబితాలోకి మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కూడా చేరాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేశాడు. 2011 వన్డే ప్రపంచ కప్ ను మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో చేజిక్కించుకున్న భారత్.. మళ్లీ 13 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ను రోహిత్ శర్మ సారథ్యంలో అందుకుంది. దాంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

రోహిత్ శర్మ గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ..”రోహిత్ శర్మ అద్భుతమైన నాయకుడు. ముంబై ఇండియన్స్ కు ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించిన ఘనత అతడి సొంతం. తాజాగా టీ20 వరల్డ్ కప్ ను భారత్ కు అందించాడు. దాంతో కపిల్ దేవ్, ఎంఎస్ ధోని సరసన నిలిచాడు. ఒక నాయకుడికి ఇంతకు మించి ఇంకేం కావాలి? రోహిత్ సాధించిన ఈ ప్రపంచ కప్ కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంటుంది. ఇక హిట్ మ్యాన్ కెప్టెన్సీలో ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. అందుకే సహచర ప్లేయర్లు అంతా రోహిత్ గుడ్ మ్యాన్ అని చెబుతారు. రోహిత్ శర్మ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్” అని ఆకాశానికి ఎత్తేశాడు మాజీ క్రికెటర్. కాగా.. వరల్డ్ కప్ సాధించిన తర్వాత రోహిత్ తన టీ20 కెరీర్ కు వీడ్కోలు పలికాడు.