Rohit Sharma: అది క్రికెట్ కు చాలా ప్రమాదకరం.. దానికి నేను పూర్తిగా వ్యతిరేకం: రోహిత్ శర్మ

అది క్రికెట్ కు ప్రమాదకరమని, ఆల్ రౌండర్ల పాలిట శాపంగా మారుతోందని, దానికి నేను వ్యతిరేకమని టీమిండియా కెప్టెన్, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

అది క్రికెట్ కు ప్రమాదకరమని, ఆల్ రౌండర్ల పాలిట శాపంగా మారుతోందని, దానికి నేను వ్యతిరేకమని టీమిండియా కెప్టెన్, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ టీమ్ కు మాత్రం విజయాన్ని అందించకపోగా.. సెల్ఫిష్ అంటూ విమర్శలు మూటగట్టుకున్నాడు. కాగా.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రోహిత్ ఐపీఎల్ లో ఉన్న ఓ రూల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ రూల్ ప్రమాదకరం అని, దానికి నేను బిగ్ ఫ్యాన్ ను కాదని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ దాదాపు సగం పూర్తైంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. అయితే ఐపీఎల్ కొత్తగా తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ రూల్ డేంజర్ అని, దానికి నేను ఫ్యాన్ ను కాదని, వ్యతిరేకమని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ యూట్యూబ్ ఛానల్ తో రోహిత్ ఈ విధంగా మాట్లాడాడు.

“నేను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కు అభిమానిని కాదు. ఇది ఆల్ రౌండర్లకు శాపం లాంటింది. వారిని వెనక్కి లాగుతుంది. దుబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లు బౌలింగ్ వేయకుండా ఈ రూల్ కట్టడి చేస్తుంది. ఇదంత మంచి రూల్ కాదని నా అభిప్రాయం. 12 మంది ప్లేయర్లు ఆటడం ఎంటర్ టైనింగ్ గానే ఉన్నా.. ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ రూల్ ఒక్కటే కాదు. ఇది ప్రమాదకరమైన రూల్.. అందుకే నేను దానికి వ్యతిరేకం” అని చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్. ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో 261 పరుగులు చేశాడు రోహిత్. మరి ఇంపాక్ట్ రూల్ కు వ్యతిరేకం అన్న హిట్ మ్యాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments