Rohit Sharm: రూ.275 స్కాలర్‌షిప్‌ నుంచి.. వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్‌! ఇదీ రోహిత్‌ సక్సెస్‌

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక 275 రూపాయల స్కాలర్​షిప్ స్టోరీ ఉంది. దీని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇవాళ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక 275 రూపాయల స్కాలర్​షిప్ స్టోరీ ఉంది. దీని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

 ఎట్టకేలకు రోహిత్‌ శర్మ కల నెలవేరింది.. కెప్టెన్‌గా టీమిండియాకు వరల్డ్‌ కప్‌ అందించాలని ఎన్నో ఏళ్లుగా కలగంటూ.. అందుకోసం కష్టపడుతూ.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024తో దాన్ని సాధించాడు. సౌతాఫ్రికాతో  జరిగిన ఫైనల్‌లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. అయితే.. రోహిత్‌ శర్మ కెరీర్‌ రూ.275 స్కాలర్‌షిప్‌తో మొదలైంది. ఆ స్కాలర్‌ షిప్‌ లేకుంటే ఈ రోఉ టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ వరల్డ్‌ కప్‌ను ఎత్తేవాడే కాదు. రోహిత్‌ జీవితంలో ఎప్పటకీ మర్చిపోలేని.. రూ.275 స్కాలర్క్‌ షిప్‌ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోహిత్‌ శర్మ 1987లో ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ లో బన్సోడ్‌ లో జన్మించాడు. తల్లిదండ్రులు గురునాథ్‌ శర్మ-పూర్ణిమ శర్మ. వారి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రోహిత్‌ చిన్నతనం నుంచి బోరివాలిలో మేనమామల వద్దే పెరిగాడు. అయితే.. స్కూల్‌ టైమ్‌ నుంచి రోహిత్‌ క్రికెట్ బాగా ఆడేవాడు. 1999లో ఇండియన్ క్రికెట్ టీమ్ మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలో ఇంగ్లండ్‌లో ప్రపంచకప్ ఆడుతోంది. ఆ సమయంలో ముంబై శివార్లలోని బొరివాలీలో 12 ఏళ్ల వయసున్న రోహిత్ శర్మను క్రికెట్ క్యాంప్‌ కు పంపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో బోరివాలిలోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్‌ జట్టుతో రోహిత్‌ ఓ మ్యాచ్ ఆడాడు. ఆ ఒక్క మ్యాచ్‌ రోహిత్‌ జీవితాన్ని మలుపుతిప్పింది.

ఆ మ్యాచ్‌ లో రోహిత్‌ శర్మ ఆటకు ఫిదా అయిపోయాడు వివేకానంద స్కూల్ కోచ్ రమేష్ లాడ్. వెంటనే రోహిత్‌ ను తమ స్కూల్‌లో చేరిపోయి, తమ జట్టు తరఫున ఆడాలని కోరాడు. కానీ, రోహిత్‌ శర్మకి.. వివేకానంద స్కూల్‌లో ఫీజు కట్టేంత స్థోమత లేదు. రోహిత్‌ తండ్రి ఓ సాధారణ ఉద్యోగి. ఇదే విషయాన్ని రోహిత్‌ ఎంతో వినయంగా.. కోచ్‌ రమేష్‌ లాడ్‌ కు వెల్లాడించాడు. దీంతో కోచ్‌ ఈ విషయంపై వివేకానంద స్కూల్‌ యజమాని యోగేశ్ పటేల్‌ తో మాట్లాడారు. రోహిత్‌ శర్మకు ఎంతైతే స్కూల్‌ ఫీజు ఉందో అంత స్కాలర్‌ షిప్‌ మంజూరు చేయాలని సిఫార్సు చేయడంతో యోగేశ్‌ రూ.275 స్కాలర్‌ షిప్‌ ఇచ్చేందుకు అంగీకరించారు.

దీంతో రోహిత్‌ శర్మకు వివేకానంద స్కూల్‌లో అడ్మిషన్‌తో పాటు నాలుగేళ్ల పాటు ఉచిత చదువు, క్రికెట్‌ కోచింగ్‌ దక్కింది. ఇక్కడి నుంచి రోహిత్‌ శర్మ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగి.. పలు క్లబ్స్‌ కు, అలాగే ముంబై తరఫున రంజీ ట్రోఫీలు ఆడి.. భారత జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. జట్టులోకి వచ్చిన తర్వాత కూడా రోహిత్‌ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ కంటే ముందే టీమిండియాలోకి వచ్చినా.. జట్టులో నిలదొక్కుకోడానికి చాలా టైమ్‌ పట్టింది. కానీ, ఒక్కసారి జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత.. తన సత్తా చాటుతున్నాడు.  ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో బ్యాటింగ్‌లో ముందుండి జట్టును నడిపించిన రోహిత్‌.. కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. అతని కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరి స్కూల్‌ ఫీజు కూడా కట్టలేని స్థాయి నుంచి దేశానికి టీ20 వరల్డ్‌ కప్‌ అందించే కెప్టెన్‌ స్థాయికి రోహిత్‌ శర్మ ఎదిగిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాకిస్థానీలకు ఇచ్చి పడేసిన షమి.. ఎంత చెప్పినా మారరంటూ..!

Show comments