iDreamPost
android-app
ios-app

వీడియో: హార్ధిక్‌ పాండ్యాను కాకితో పోల్చిన రోహిత్‌ శర్మ! ఎందుకంటే..?

  • Published Mar 21, 2024 | 2:57 PM Updated Updated Mar 21, 2024 | 2:57 PM

Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు రోహిత్‌ శర్మ-హర్బజన్‌సింగ్‌ మాట్లాడుకున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పాండ్యాను రోహిత్‌ శర్మ కాకి అని అన్నాడు. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Hardik Pandya: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ఆరంభానికి ముందు రోహిత్‌ శర్మ-హర్బజన్‌సింగ్‌ మాట్లాడుకున్న ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పాండ్యాను రోహిత్‌ శర్మ కాకి అని అన్నాడు. అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 21, 2024 | 2:57 PMUpdated Mar 21, 2024 | 2:57 PM
వీడియో: హార్ధిక్‌ పాండ్యాను కాకితో పోల్చిన రోహిత్‌ శర్మ! ఎందుకంటే..?

ఐపీఎల్‌ 2024లో హైలెట్‌గా నిలిచే విషయం ఏంటంటే.. హార్ధిక్‌ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్‌ శర్మ ఆడటం. ఎవరి కెప్టెన్సీలో ఎవరు ఆడినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, ముంబై ఇండియన్స్‌కి చాలా కాలం కెప్టెన్‌గా చేసి, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మ, పైగా టీమిండియా కెప్టెన్‌గా ఉన్న సమయంలో అతన్ని కెప్టెన్సీ నుంచి తీసేసి.. హార్ధిక్‌ పాండ్యాని కెప్టెన్‌గా నియమించడం ఎవరికి నచ్చలేదు. ఈ విషయంపై రోహిత్‌ డైరెక్ట్‌గా స్పందించినకపోయినా.. అతని భార్య రితికా మాత్రం రియాక్ట్‌ అయింది. ఏది ఏమైనా.. ఈ సారి ఐపీఎల్‌లో పాండ్యా-రోహిత్‌ పైనే అందరి కళ్లు ఉన్నాయి.

అయితే.. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా గురించి మాట్లాడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. రోహిత్‌ శర్మ, టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్‌, ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ హర్భజన్‌ సింగ్‌ ఓ వీడియో కాల్‌లో మాట్లాకుంటూ ఉండగా.. హార్ధిక్‌ పాండ్యా ప్రస్తావన వచ్చింది. భజ్జీ మాట్లాడుతూ.. పాండ్యా డౌన్‌ ది ఆర్డర్‌లో మంచి చాలా మంది బ్యాటింగ్‌ చేస్తాడని, అగ్రెసివ్‌గా ఆడతాడని చెబుతుండగా.. రోహిత్‌ శర్మ హిందీలో ‘కవ్వా’ అని అన్నాడు. దానికి భజ్జీ కూడా ‘కవ్వా’ అని బదులిచ్చాడు. కవ్వా అంటే కాకి అని అర్థం. అది పాండ్యా నిక్‌నేమ్‌ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు.

కవ్వా అని పిలిస్తే పాండ్యాకు అస్సలు నచ్చదని, ఈ విషయాన్ని వదిలేద్దామని అన్నాడు. లేకుంటే నాకు మేసేజ్‌ చేస్తాడని రోహిత్‌ అన్నాడు. దానికి భజ్జీ.. పర్లేదులే వాడు మన తమ్ముడే అంటూ బదులిచ్చాడు. అయితే.. పాండ్యాను చాలా మంది కుంఫు పాండ్యా అని పిలుస్తుంటారు. కానీ, పాండ్యాకు కాకి అనే మరో పేరు ఉందని ఇప్పుడు రోహిత్‌ శర్మ చెప్పేంత వరకు ఎవరికి తెలియదని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే ఆ వీడియో ఎప్పటిదనే విషయంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో పాండ్యాను కవ్వా అని రోహిత్‌ అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.