iDreamPost
android-app
ios-app

దిగొచ్చిన MI మేనేజ్‌మెంట్‌.. రోహిత్‌కి కెప్టెన్సీ ఆఫర్? హిట్‌మ్యాన్‌ ఆన్సర్ అదిరింది!

  • Published Apr 05, 2024 | 6:12 PM Updated Updated Apr 05, 2024 | 6:12 PM

Rohit Sharma, Mumbai Indians: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయేసరికి ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌కు కనువిప్పు కలిగినట్లు ఉంది. కానీ, మేనేజ్‌మెంట్‌కు రోహిత్‌ శర్మ తనదైన స్టైల్‌లో ఇప్పుడు రిప్లేయ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Mumbai Indians: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయేసరికి ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌కు కనువిప్పు కలిగినట్లు ఉంది. కానీ, మేనేజ్‌మెంట్‌కు రోహిత్‌ శర్మ తనదైన స్టైల్‌లో ఇప్పుడు రిప్లేయ్‌ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 05, 2024 | 6:12 PMUpdated Apr 05, 2024 | 6:12 PM
దిగొచ్చిన MI మేనేజ్‌మెంట్‌.. రోహిత్‌కి కెప్టెన్సీ ఆఫర్? హిట్‌మ్యాన్‌ ఆన్సర్ అదిరింది!

వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన తర్వాత ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌కు బుద్ధి వచ్చినట్లు కనిపిస్తోంది. ఏకంగా ఐదు సార్లు టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపిన వ్యక్తిని కెప్టెన్సీ నుంచి తప్పించి.. కేవలం డబ్బు కోసం టీమ్‌ మారిన ప్లేయర్‌కు కెప్టెన్సీ ఇచ్చారనే కోపంతో చాలా మంది క్రికెట్‌ అభిమానులు ముంబై ఇండియన్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకంగా 2 మిలియన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు ముంబై ఇండియన్స్‌ను అన్‌ఫాలో కొట్టేశారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఆడుతున్న మ్యాచ్‌ల సమయంలో హార్ధిక్‌ పాండ్యాను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

అభిమానుల నుంచి వచ్చిన వ్యతిరేకతను ఏం మాత్రం లెక్కచేయని ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌.. టీమ్‌ ప్రదర్శనపై మాత్రం చాలా కంగారుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్.. ఒక్క విజయం కూడా లేని ఏకైక టీమ్‌గా, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇంత దారుణమైన పరిస్థితిని గుర్తించిన ముంబై మేనేజ్‌మెంట్‌.. తాజాగా రోహిత్‌ శర్మతో కాళ్ల బేరానికి వచ్చినట్లు సమాచారం. మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా రోహిత్‌ను ముంబై మేనేజ్‌మెంట్‌ బతిమిలాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో కూడా ఫ్యాన్స్‌ ఈ విషయంపై మాట్లాడుతున్నారు.

అయితే.. ముంబై ఇండియన్స్‌ మేనేజ్మెంట్‌ నుంచి వచ్చిన ఆఫర్‌ను రోహిత్‌ శర్మ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తనను చాలా అవమానకరంగా కెప్టెన్సీ తప్పించడంపై ఆగ్రహంగా ఉన్న రోహిత్‌.. తిరిగి ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేడని సమాచారం. ఇదే విషయాన్ని ముంబై మేనేజ్‌మెంట్‌కు కూడా చెప్పేశాడంటా.. పైగా వచ్చే సీజన్‌లో తాను ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడటంలేదని, వేరే టీమ్‌కు మారిపోతానని కూడా రోహిత్‌ కుండబద్దలు కొట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ తప్పు తెలుసుకుని.. రోహిత్‌ను మళ్లీ కెప్టెన్సీ తీసుకోవాలని కోరడం, దాన్ని రోహిత్‌ రిజెక్ట్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.