Nidhan
Virat Kohli, Rohit Sharma, IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో కోహ్లీ ఔట్ అయిన తీరు ఇప్పుడు డిస్కషన్స్‌కు దారితీసింది. క్లియర్ నాటౌట్ అయినా కింగ్ రివ్యూ తీసుకోలేదు. ఈ టైమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Virat Kohli, Rohit Sharma, IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో కోహ్లీ ఔట్ అయిన తీరు ఇప్పుడు డిస్కషన్స్‌కు దారితీసింది. క్లియర్ నాటౌట్ అయినా కింగ్ రివ్యూ తీసుకోలేదు. ఈ టైమ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంత ఈజీగా ఔట్ అవ్వడు. అతడ్ని పెవిలియన్‌కు పంపాలంటే అవతల బౌలర్ బెస్ట్ బాల్ వేయాల్సిందే. ఒక్కోసారి అంపైర్ మిస్టేక్స్, టైమ్ కలసిరాక అతడు ఔట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి స్వీయ తప్పిదంతో అతడు వెనుదిరిగాడు. తన వికెట్‌ను బంగ్లాదేశ్ టీమ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. ఆ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసి నిరాశపర్చాడు విరాట్. రెండో ఇన్నింగ్స్‌లోనైనా చెలరేగి ఆడతాడనుకుంటే అది సాధ్యపడలేదు. 37 బంతుల్లో 17 పరుగులు చేశాక ఔట్ అయ్యాడు. రెండు బౌండరీలు కొట్టి ఊపు మీదున్న కింగ్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని అంతా ఆశించారు. కానీ క్రీజులో సెటిల్ అయ్యాక అనవసరంగా వికెట్ ఇచ్చేశాడు కోహ్లీ. నాటౌట్ అయినా గానీ క్రీజును వీడాడు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ సీరియస్ అయ్యాడు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్‌కు మంచి ఆరంభం లభించలేదు. రోహిత్ (5)తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10) త్వరగా పెవిలియన్‌కు చేరారు. దీంతో క్రీజులోకి వచ్చిన విరాట్‌పై పెద్ద భారం పడింది. యంగ్‌స్టర్ శుబ్‌మన్ గిల్‌తో కలసి ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన బాధ్యత తీసుకున్నాడు కింగ్. ఇద్దరూ కలసి మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. దీంతో మరో వికెట్ పడకుండా డే2ను ముగిస్తారనుకుంటే.. సడన్‌గా కోహ్లీ ఔట్ అయ్యాడు. స్పిన్నర్ మెహ్దీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో ఫుల్ లెంగ్త్‌లో పడి వేగంగా వచ్చిన బంతిని అక్రాస్ షాట్ కొడదామని అనుకున్నాడు కోహ్లీ. కానీ బాల్ ప్యాడ్స్‌కు తగలడంతో మిరాజ్ అప్పీల్ చేయడం, అంపైర్ ఔట్ ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయింది. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అని విరాట్ ఆలోచించాడు. నాన్ స్ట్రయికర్ గిల్‌ను సాయం అడిగాడు.
డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా? అని గిల్‌తో కాసేపు డిస్కస్ చేశాడు కోహ్లీ. అయితే శుబ్‌మన్ ఏమన్నాడో గానీ విరాట్ రివ్యూ తీసుకోలేదు. క్లారిటీ లేకపోవడం, డౌట్ ఉండటంతో అతడు డీఆర్ఎస్కు వెళ్లలేదు. అది ఔట్ అని భావించి క్రీజును వీడి పెవిలియన్ దిశగా నడుస్తూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత రీప్లేలో చూస్తే కోహ్లీ నాటౌట్ అని తేలింది. అతడు షాట్ కొట్టే టైమ్‌లో బాల్ క్లియర్‌గా బ్యాట్‌కు తగిలి ఎడ్జ్ తీసుకుందని బయటపడింది. బ్యాట్‌కు తగిలాకే బాల్ ప్యాడ్స్‌కు తగిలినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ బిత్తరపోయాడు. ఔటా? నాటౌటా? అనేది తర్వాత.. ఫస్ట్ రివ్యూ అయితే తీసుకోవాలి కదా అంటూ అతడు ఆశ్చర్యపోయాడు. కోహ్లీ వికెట్ టీమ్‌కు చాలా ముఖ్యం. అలాంటప్పుడు రివ్యూ తీసుకోకపోతే నష్టమే. అందుకే విరాట్ ఎందుకు ఇలా చేశాడంటూ హిట్‌మ్యాన్ అసహనానికి లోనయ్యాడు. కోహ్లీ రివ్యూ తీసుకోకపోవడంతో అంపైర్ కెటిల్‌బరో చిన్న స్మైల్ ఇచ్చాడు. మరి.. విరాట్ నాటౌట్ అయినా రివ్యూ తీసుకోకపోవడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
There was an EDGE and Virat Kohli didn’t review it.
& the reaction says it all!
📸: Jio Cinema#INDvBAN | #ViratKohli pic.twitter.com/ZFaW8Kcp7H
— OneCricket (@OneCricketApp) September 20, 2024