SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో ఓటమి పాలైనా.. రోహిత్ శర్మ కెప్టెన్సీపై, రోహిత్ బ్యాటింగ్ ఎబిలిటిపై ఎవరికి ఎలాంటి ఫిర్యాదులు లేదు. అతను టీ20 వరల్డ్ కప్ ఆడాలని అంతా కోరకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎవరిలో లేని అంచనాలను రోహిత్ శర్మ ఒక్క మాటతో పెంచేశాడు. అది కూడా మరో వరల్డ్‌కప్‌పై. అదేంటో ఇప్పుడు చూద్దాం..
వన్డే వరల్డ్ కప్ 2023లో ఓటమి పాలైనా.. రోహిత్ శర్మ కెప్టెన్సీపై, రోహిత్ బ్యాటింగ్ ఎబిలిటిపై ఎవరికి ఎలాంటి ఫిర్యాదులు లేదు. అతను టీ20 వరల్డ్ కప్ ఆడాలని అంతా కోరకుంటున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎవరిలో లేని అంచనాలను రోహిత్ శర్మ ఒక్క మాటతో పెంచేశాడు. అది కూడా మరో వరల్డ్‌కప్‌పై. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ వర్మ కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి పాలైనా.. రోహిత్ కెప్టెన్సీపై ఎవరూ వేలెత్తి చూపలేదు. ఎందుకంటే.. టోర్నీ ఆసాంతం రోహిత్ కెప్టెన్‌గా మంచి ప్రదర్శనను కనబర్చాడు. అయితే.. వరల్డ్ కప్ టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి.. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై.. వరల్డ్ కప్‌ను చేజార్చుకోవడంతో సగటు క్రికెట్ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్ల సైతం గ్రౌండ్‌లో చిన్న పిల్లల్లా ఏడ్చేశారు. ఆ సీన్ చూసిన.. క్రికెట్ అభిమాల కళ్లు కూడా చెమ్మగిల్లాయి. కాగా, ఆ గాయాన్ని రోహిత్ ఇంకా మర్చిపోయినట్టు లేడు. కానీ, అదే బాధలో ఉండిపోకుండా.. భారత క్రికెట్ అభిమానులకు మరో వరల్డ్ కప్ ఆశలు రేపాడు హిట్‌మ్యాన్.
అసలు రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ ఆడతాడా? లేదా? అతన్ని టీ20 వరల్డ్ కప్ 2024 కోసం ఎంపిక చేస్తారా? లేదా? అనే అనుమానాల నేపథ్యంలో రోహిత్ పాటు కోహ్లీని సైతం ఆఫ్ఘాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడంతో డౌట్స్ అని పటాపంచలు అయ్యాయి. బుధవారం ముగిసిన చివరి టీ20లో రోహిత్ విధ్వంస సెంచరీతో తనపై ఉన్న అనుమానాలు సైతం పొగొట్టాడు. అయితే.. ఈ అద్భుత సెంచరీతో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఒక్క మాటతోనే భారత క్రికెట్ అభిమానుల్లో టీ20 వరల్డ్ కప్ 2024పై అంచనాలు పెంచేశాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్-యూఏఎస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీపై మొన్నటి వరకు టీమిండియా క్రికెట్ అభిమానుల్లో ఎలాంటి అంచనాలు, ఆశలు లేవు. ఎందుకంటే.. ఎన్నో ఆశలు పెట్టుకున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అత్యద్భుతంగా ఆడినా.. ఫైనల్లో ఓడి, కప్పును చేజార్చుకుంది. చాలా మంది క్రికెట్ అభిమానులు ఆ బాధ నుంచి బయటపడి.. మరో వరల్డ్ కప్‌పై ఆశలు పెట్టుకునే స్థితిలో లేరు. కానీ రోహిత్ ఒక్క మాటతో మళ్లీ ఆశలు రేకెత్తించాడు. వన్డే వరల్డ్ ఓటమిపై ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘దాన్ని నేను గుర్తుచేసుకోవాలని అనుకోవడం లేదు. అది చాలా బాధించింది. కానీ, వన్డే వరల్డ్ కప్ అంటే దేశంలో అంచనాలు భారీగా ఉంటాయి. కానీ, మేం దాన్ని సాధించలేకపోయాం. నాకు వన్డే వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకం, చిన్నతనం నుంచి దాన్ని చూస్తూనే పెరిగా.. అలా అని టెస్ట్ ఛాంపియన్ షిప్, టీ20 వరల్డ్ కప్ అంటే ఇష్టంలేదని కాదు. మాకు జూన్‌లో మరో అవకాశం ఉంది. ఈ సారి వరల్డ్ కప్ గెలవాలనుకుంటున్నాం.’ అంటూ రోహిత్ పేర్కొన్నాడు. మరి రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
No True Hitman will pass without liking the post 👍🏻
Rohit Sharma will Captain of INDIA in T20 World Cup 2024 🔥🔥🔥🔥
ODI World Cup 2023 Final Heart Broken Moments For #RohitSharma #INDvAFG | #T20WorldCup | #T20WorldCup2024 | #HardikPandya | #IndianCricketTeam pic.twitter.com/p6Jm0gImAd
— Hussain PTI (@apna48235) January 18, 2024