సచిన్ గురించి రోహిత్ అలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో! కొత్త చర్చ!

రోహిత్‌ శర్మ ఎంతో గంభీరంగా కనిపించినా.. మీడియా సమావేశాల్లో ఎంతో ఫన్నీగా సమాధానాలు ఇస్తుంటాడు. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌కి ముందు జరిగిన మీడియా సమావేశంలో సచిన్‌ టెండూల్కర్‌ విషయంలో ఊహించని విధంగా స్పందించారు. ప్రస్తుతం రోహిత్‌ రియాక్షన్‌ చర్చనీయాంశంగా మారింది.

రోహిత్‌ శర్మ ఎంతో గంభీరంగా కనిపించినా.. మీడియా సమావేశాల్లో ఎంతో ఫన్నీగా సమాధానాలు ఇస్తుంటాడు. తాజాగా శ్రీలంకతో మ్యాచ్‌కి ముందు జరిగిన మీడియా సమావేశంలో సచిన్‌ టెండూల్కర్‌ విషయంలో ఊహించని విధంగా స్పందించారు. ప్రస్తుతం రోహిత్‌ రియాక్షన్‌ చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియా సమావేశాల్లో ఇచ్చే సమాధానాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఎంతో క్యాజువల్‌గా మాట్లాడినట్లే ఉంటుంది కానీ, అందులోంచి ఊహించని ఫన్‌ జనరేట్‌ అవుతుంది. కెప్టెన్‌ అయిన తర్వాత నుంచి రోహిత్‌ సెన్స్‌ ఆఫ్‌ హ్యుమర్‌ మరింత పెరగిందనే చెప్పాలి. టీమ్‌ కాంబినేషన్స్‌, ప్లేయర్లు, గెలుపోటముల గురించి ప్రశ్నలు ఎదురైనప్పుడు రోహిత్‌ ఇచ్చే సమాధానాలు కొన్ని సార్లు మీడియా ప్రతినిధులను ఆటపట్టించేలా ఉంటాయి. కొన్నిసార్లు ముఖం మీద కొట్టినట్లు సమాధానాలు ఇస్తుంటాడు. తాజాగా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌కి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్‌ శర్మ ఓ అంశంపై రియాక్ట్‌ అయిన తీరు చర్చకు దారి తీసింది. అదేంటంటే..

భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ముందు రోజు అంటే.. బుధవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో క్రికెట్‌ గాడ్‌, దిగ్గజ మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముంబైకి చెందిన సచిన్‌ ఇండియన్‌ క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా స్టేడియంలో విగ్రహం ఏర్పాటు చేశారు స్టేడియం నిర్వహకులు. ఈ విగ్రహాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు బుధవారం ఆవిష్కరించారు. దీంతో.. బుధవారం సాయంత్రం మీడియా సమావేశానికి వచ్చిన రోహిత్‌ శర్మను సచిన్‌ విగ్రహం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేశారు. విగ్రహం ఏర్పాటు చేయడం గురించి, అలాగే విగ్రహం ఎలా ఉందనే విషయం గురించి ప్రస్తావించారు. వీటికి రోహిత్‌ శర్మ చాలా క్యాజువల్‌గా రియాక్ట్‌ అవుతూ.. సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి అలవంభించినట్లు కనిపించింది.

సచిన్‌ గురించి కొత్తగా రోహిత్‌ తెలుసుకోవాల్సింది ఏం లేదు. సచిన్‌ ఆట చూస్తేనే రోహిత్‌ పెరిగాడు. ఇద్దరూ ముంబైకి చెందిన ఆటగాళ్లే. ఇండియాతో పాటు ఐపీఎల్‌లోనూ కలిసి ఆడారు. పైగా సచిన్‌ అంటే క్రికెట్‌ గాడు. అలా​ంటి ఆటగాడి విగ్రహావిష్కరణ గురించి చెప్పాల్సి వస్తే.. ఓ గొప్ప ఆటగాడికి ఇలా గౌరవించుకోవడం బాగుంది అంటూ రియాక్ట్‌ అవ్వాల్సిన రోహిత్‌.. కనీసం సచిన్ పేరును కూడా పలకకపోవడం క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విగ్రహం ఇంకా చూడదేదని, ప్రాక్టీస్‌ సమయంలో దూరం నుంచి చూశానని, ఏ షాట్‌ ఆడుతున్న విగ్రహం పెట్టారో కూడా తనకు కచ్చితం తెలిదంటూ.. ఏదో అయిష్టంగా సమాధానం చెబుతున్నట్లు కనిపించాడు. అయితే.. సచిన్‌ విగ్రహం విషయంలో రోహిత్‌ ఇచ్చిన రియాక్షన్‌పై సచిన్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments