iDreamPost
android-app
ios-app

IND vs PAK: అచ్చం ప్రాక్టీస్‌లోలానే రోహిత్ అవుట్! వీడియో వైరల్

  • Published Sep 02, 2023 | 6:38 PM Updated Updated Sep 02, 2023 | 6:38 PM
  • Published Sep 02, 2023 | 6:38 PMUpdated Sep 02, 2023 | 6:38 PM
IND vs PAK: అచ్చం ప్రాక్టీస్‌లోలానే రోహిత్ అవుట్! వీడియో వైరల్

ఆసియా కప్‌ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తడబడుతూ నిలబడుతున్నట్లు కనిపిస్తోంది. శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పాకిస్థాన్‌ పేసర్లు షాహీన్‌ షా అఫ్రిదీ, హరీస్‌ రౌఫ్‌ చెలరేగడంతో పాటు రెండు సార్లు వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించడం టీమిండియా భారీ ఎదురుదెబ్బగా మారింది. ఆరంభంలోనే రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తక్కువ స్కోర్లకే అవుట్‌ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కేవలం 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

అయితే.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అవుటైన విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలింగ్‌లో ఆడేందుకు ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మ.. ఆ వీక్‌నెస్‌ను అదిగమించలేకపోతున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. మరీ ముఖ్య​ంగా షాహీన్‌ అఫ్రిదీ బౌలింగ్‌ బాగా ఇబ్బంది పడుతున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2021లో కూడా అఫ్రిదీ బౌలింగ్‌లోనే అవుట్‌ అయ్యాడు. ఇప్పుడు కూడా అతని బౌలింగ్‌లోనే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కంటే ముందు నెట్స్‌లో తెగ ప్రాక్టీస్‌ చేసిన రోహత్‌.. ముఖ్యంగా అఫ్రిదీ సంధించే బంతులను ఎలా ఎదుర్కొవాలనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టాడు. నెట్స్‌లో రోహిత్‌ శర్మ ఆఫ్‌ స్టంప్స్‌పై వచ్చే బంతులను ప్రాక్టీస్‌ చేస్తున్న క్రమంలో బంతిని ఆడటంలో విఫలం అయ్యాడు. దాంతో ఆఫ్‌ స్టెంప్‌ వికెట్‌ ఎగిరిపడింది. సరిగ్గా మ్యాచ్‌లో కూడా అలానే అవుట్‌ అవ్వడం గమనార్హం. మ్యాచ్‌లో ఇలా అవుట్‌ అయ్యేందుకు నెట్స్‌లో అంతలా ప్రాక్టీస్‌ చేయాలా అంటూ క్రికెట్‌ అభిమానులు రోహిత్‌పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs PAK: కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ! వీడియో వైరల్‌