iDreamPost
android-app
ios-app

1 రన్‌ చేసి ఉండాల్సింది! మ్యాచ్‌ టై అవ్వడానికి కారణం చెప్పిన రోహిత్‌ శర్మ!

  • Published Aug 03, 2024 | 11:29 AM Updated Updated Aug 03, 2024 | 11:29 AM

Rohit Sharma, IND vs SL: శ్రీలంకతో మ్యాచ్‌ టై కావడంతో రోహిత్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఈ మ్యాచ్‌ టై కావడానికి కారణం ఏంటో కూడా రోహిత్‌ శర్మ చెప్పేశాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, IND vs SL: శ్రీలంకతో మ్యాచ్‌ టై కావడంతో రోహిత్‌ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఈ మ్యాచ్‌ టై కావడానికి కారణం ఏంటో కూడా రోహిత్‌ శర్మ చెప్పేశాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 03, 2024 | 11:29 AMUpdated Aug 03, 2024 | 11:29 AM
1 రన్‌ చేసి ఉండాల్సింది! మ్యాచ్‌ టై అవ్వడానికి కారణం చెప్పిన రోహిత్‌ శర్మ!

శ్రీలంకపై గెలవాల్సిన మ్యాచ్‌ను టీమిండియా టైతో సరిపెట్టుకుంది. నిజానికి దీన్ని టై అనేకంటే.. టీమిండియా ఓటమి అనడమే కరెక్ట్‌. ఎందుకంటే.. 231 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ క్రమంలో.. రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ చేసినా.. కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ క్రీజ్‌లో కుదురుకున్నా.. చివరి 15 బంతుల్లో చేతిలో రెండు వికెట్లు ఉంచుకుని కూడా ఒక్క పరుగు కేవలం ఒక్క పరుగు చేయలేకపోయింది భారత జట్టు. ఒక్క రన్‌ కోసం ఏకంగా రెండు వికెట్లు కోల్పోయి.. మ్యాచ్‌ను టైగా ముగించింది. టీ20 స్టైల్‌ బ్యాటింగ్‌తో టీమిండియా సూపర్‌ స్టార్ట్‌ ఇచ్చిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. మ్యాచ్‌ టై అవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే అసలు మ్యాచ్‌ టై కావడానికి కారణం ఏంటో కూడా వెల్లడించాడు.

మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘231 టార్గెట్‌ ఛేజ్‌ చేయదగిందే.. కానీ, మా బ్యాటింగ్‌ సరిగా లేదు. మధ్య మధ్యలో బాగానే బ్యాటింగ్‌ చేశాం.. కానీ​, కొనసాగించలేకపోయాం. మాకు మంచి స్టార్ట్‌ దొరికింది. కానీ, అసలు మ్యాచ్‌ 10వ ఓవర్‌ తర్వాత స్పిన్నర్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొదలైంది. స్టార్టింగ్‌లో మేమే డామినేట్‌ చేశాం.. కానీ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌లో కాస్త వెనుకబడ్డాం. తిరిగి కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ పార్ట్‌నర్‌షిప్‌తో మ్యాచ్‌లోకి కమ్‌బ్యాక్‌ ఇచ్చాం. కానీ, మ్యాచ్‌ టై అవ్వడం నిరాశకలిగించింది. 14 బంతుల్లో ఒక రన్‌ చేసి ఉండాల్సింది. కానీ, కొన్ని సార్లు ఇలా జరుగుతుంది. శ్రీలంక కూడా బాగా ఆడింది. పిచ్‌ని బట్టి చూస్తే.. ఇది ఫెయిర్‌ మ్యాచ్‌. రెండు టీమ్స్‌కు ఒకే విధమైన సపోర్ట్‌ లభించింది. ఏది ఏమైనా.. ఆ ఒక్క రన్‌ చేసి ఉండాల్సింది.’ అని రోహిత్‌ శర్మ వెల్లడించాడు.

మొత్తంగా రోహిత్‌ శర్మ టీమ్‌లోని ఇతర బ్యాటర్లు సరిగా ఆడలేదని భావించాడు. అతని స్టేట్‌మెంట్‌ను చూస్తే ఆ విషయం స్పష్టంగా మిగతా బ్యాటర్లు బాగా ఆడలేదు అని చెప్పేస్తున్నాడు. ముఖ్యంగా శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌లకు ఈ కామెంట్స్‌ గుచ్చుకునేలా ఉన్నాయి. గిల్‌ 35 బంతుల్లో 16 పరుగుల మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. కోహ్లీ 32 బంతుల్లో 24 రన్స్‌ చేసి మంచి స్టార్ట్‌ అందుకున్నా.. పెద్ద స్కోర్‌ చేయలేకపోయాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అంతే.. 23 బంతుల్లో 23 చేసి అవుట్‌ అయ్యాడు. అయితే.. చివర్లో ఒక రన్‌ చేయాల్సిన టైమ్‌ దూబే అవుట్‌ కావడం, అర్షదీప్‌ సింగ్‌ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ కావడంపై కూడా రోహిత్‌ అసంతృప్తిగా ఉన్నాడు. ఆ ఒక్క రన్‌ చేయాల్సిందంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. మరి ఈ మ్యాచ్‌ టై కావడంపై రోహిత్‌ చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.