Rohit Sharma Jokes On Suryakumar Yadav Catch: సూర్య విన్నింగ్ క్యాచ్​పై రోహిత్ రియాక్షన్.. అలా అనేశాడేంటి?

Rohit-Surya: సూర్య విన్నింగ్ క్యాచ్​పై రోహిత్ రియాక్షన్.. అలా అనేశాడేంటి?

ఒక్క క్యాచ్​తో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. భారత్​ కప్ గెలవడంలో ఎంతో కీలకంగా మారిన ఈ క్యాచ్​పై కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు.

ఒక్క క్యాచ్​తో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్. భారత్​ కప్ గెలవడంలో ఎంతో కీలకంగా మారిన ఈ క్యాచ్​పై కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు.

వరల్డ్ కప్ ట్రోఫీతో స్వదేశానికి వచ్చినప్పటి నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ బిజీ అయిపోయాడు. తొలుత జట్టులోని ఆటగాళ్లందరితో కలసి ప్రధాని నరేంద్ర మోడీని కలిశాడు హిట్​మ్యాన్. ఆయనతో కలసి బ్రేక్​ఫాస్ట్ చేసి ప్రపంచ కప్ విశేషాలను పంచుకున్నాడు. అనంతరం ముంబైకి బయల్దేరింది భారత జట్టు. అక్కడి ఎయిర్​పోర్ట్​లో టీమిండియా ఫ్లైట్​కు వాటర్ సెల్యూట్​తో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్​పోర్ట్ బయట వేలాది మంది గుమిగూడి క్రికెటర్లకు గ్రాండ్ వెల్​కమ్ చెప్పారు. అనంతరం ఓపెన్​ బస్​లో వాంఖడే స్టేడియానికి వెళ్లిన మెన్ ఇన్ బ్లూ.. మైదానంలో రచ్చ రచ్చ చేశారు. ఆటగాళ్లంతా పలు సాంగ్స్​కు డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ అభిమానులను అలరించారు. కెప్టెన్ రోహిత్ కూడా విక్టరీ స్పీచ్ ఇచ్చాక.. ఫుల్​గా ఎంజాయ్ చేశాడు.

విక్టరీ పరేడ్ ముగించుకొని ఇంటికి చేరుకున్న రోహిత్.. ఇవాళ మహరాష్ట్ర విధాన సభ (అసెంబ్లీ)కి వెళ్లాడు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశాడు హిట్​మ్యాన్. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబె కూడా షిండేను కలిశారు. అనంతరం రోహిత్ పవర్​ఫుల్ స్పీచ్​తో అదరగొట్టాడు. భారత జట్టు వరల్డ్ కప్ జర్నీ గురించి మరాఠీలో మాట్లాడాడు. దీంతో సభలోని ఎమ్మెల్యేలు అందరూ చప్పట్లతో అభినందించారు. రోహిత్.. రోహిత్ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్​ను మలుపు తిప్పిన సూర్యకుమార్ పట్టిన క్యాచ్ గురించి అతడు ప్రస్తావించాడు. ఒకవేళ ఆ క్యాచ్ గనుక మిస్ అయి ఉంటే సూర్యను తీసేసేవాడ్ని అంటూ జోక్ చేశాడు.

‘చేతిలో బంతి పడిందని, అది అతుక్కున్నట్లు అనిపించిందని సూర్య నాతో చెప్పాడు. ఒకవేళ అలా గనుక జరిగి ఉండకపోతే మాత్రం అతడ్ని పక్కనబెట్టేవాడ్ని’ అంటూ మరాఠీలో కామెడీ చేశాడు రోహిత్. దీంతో సభలోని ఎమ్మెల్యేలంతా నవ్వుల్లో మునిగిపోయారు. సాధారణంగా ప్రెస్ మీట్లలో కూడా ఇలాగే నవ్వులు పూయించే హిట్​మ్యాన్.. మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా తన కామెడీ టైమింగ్​తో ఆకట్టుకున్నాడు. కాగా, రోహిత్ వల్లే ఇవాళ రాష్ట్ర నేతలంతా ఒక్కటయ్యామని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇక, వరల్డ్ కప్ ఫైనల్​లో సూర్య పట్టిన క్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందనే చెప్పాలి. కీలక సమయంలో డేంజరస్ డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్​ను అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు సూర్య.

Show comments