iDreamPost
android-app
ios-app

ఆ విషయం చెప్పేందుకు సిగ్గుపడను.. నేనేంటో వాళ్లకు తెలుసు: రోహిత్ శర్మ

  • Published Sep 18, 2024 | 3:23 PM Updated Updated Sep 18, 2024 | 3:23 PM

Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​లో, బయట ఒకేలా ఉంటాడు. సీరియస్​గా ఉండటం అతడి వల్ల కాదు. నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తన చుట్టూ పాజిటివ్​ ఎన్విరాన్​మెంట్ ఉండేలా చూసుకుంటాడు హిట్​మ్యాన్.

Rohit Sharma, IND vs BAN: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గ్రౌండ్​లో, బయట ఒకేలా ఉంటాడు. సీరియస్​గా ఉండటం అతడి వల్ల కాదు. నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తన చుట్టూ పాజిటివ్​ ఎన్విరాన్​మెంట్ ఉండేలా చూసుకుంటాడు హిట్​మ్యాన్.

  • Published Sep 18, 2024 | 3:23 PMUpdated Sep 18, 2024 | 3:23 PM
ఆ విషయం చెప్పేందుకు సిగ్గుపడను.. నేనేంటో వాళ్లకు తెలుసు: రోహిత్ శర్మ

క్రికెట్​లో ఒక్కో కెప్టెన్ ఒక్కోలా ఉంటాడు. కొందరు సారథులు సీరియస్​గా ఉంటే, మరికొందరు నవ్వుతూ, కూల్​గా సిచ్యువేషన్స్​ను హ్యాండిల్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు చాలా అరుదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ కేటగిరీలోకి వస్తాడు. గ్రౌండ్​లో, బయట ఒకేలా ఉంటాడతను. సీరియస్​గా ఉండటం అతడి వల్ల కాదు. నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తన చుట్టూ పాజిటివ్​ ఎన్విరాన్​మెంట్ ఉండేలా చూసుకుంటాడు హిట్​మ్యాన్. కొన్నిసార్లు ప్లేయర్ల మీద అరిచినా కొద్దిసేపట్లో వాళ్లతో మళ్లీ కలిసిపోతాడు. ఆటగాళ్లు స్వేచ్ఛగా, తమకు నచ్చినట్లు ఆడేందుకు అవకాశం కల్పిస్తాడు. సీనియర్స్, జూనియర్స్ అనే తేడా లేకుండా అందరితో చనువుగా ఉంటాడు. అందుకే హిట్​మ్యాన్​ను అందరూ నమ్ముతారు. అతడి గోల్​ను తమ గోల్​గా భావించి ఇష్టంతో ఆడుతుంటారు. ఇదే విషయంపై తాజాగా రోహిత్ రియాక్ట్ అయ్యాడు. ఆన్​ఫీల్డ్ తన బిహేవియర్​, డ్రెస్సింగ్ రూమ్ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

గ్రౌండ్​లో తాను ఏం చూస్తానో అదే మాట్లాడతానని రోహిత్ అన్నాడు. ఫీల్డ్​లో తనను తాను ఎక్స్​ప్రెస్ చేయడానికి ఏమాత్రం సంకోచించనని తెలిపాడు. ఎవరేం అనుకుంటారోనని సిగ్గుపడటం తన వల్ల కాదన్నాడు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతానన్నాడు హిట్​మ్యాన్. టీమ్​లోని ప్రతి ఆటగాడికి తానేంటో తెలుసునని అన్నాడు. తానేంటో తెలిసిన వారికి, తన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుందన్నాడు. డ్రెస్సింగ్ రూమ్​లో ఉండేవారికి తానే తప్పు చేయనని తెలుసునన్నాడు రోహిత్. కాగా, గ్రౌండ్​లో చాలా జోవియల్​గా ఉండే హిట్​మ్యాన్.. సహచరులపై జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటాడు. అందుకే ఫీల్డ్​లో తాను కోప్పడినా, సీరియస్ అయినా, తిట్టినా ఎవరూ ఫీల్ అవ్వరని.. తన పర్సనాలిటీ ఏంటనేది అందరికీ తెలుసునని భారత కెప్టెన్ పేర్కొన్నాడు. జట్టు గెలుపు కోసం అందరమూ కృషి చేస్తామని.. ఇవన్నీ సహజమేనన్నాడు.

రిటైర్మెంట్​ మీద కూడా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్​లో రిటైర్మెంట్ అనేది ఈ రోజుల్లో పెద్ద జోక్​గా మారిందన్నాడు. కొందరు ఆటగాళ్లు ఆటకు గుడ్​బై చెబుతున్నట్లు ప్రకటించి.. కొన్నాళ్లకు మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నారని తెలిపాడు. మన దేశంలో అలాంటివి జరగడం లేదన్నాడు. కానీ ఇతర దేశాల్లో ఇది సాధారణంగా మారిందన్నాడు. వేరే దేశాల క్రికెటర్లను తాను అబ్జర్వ్ చేస్తుంటానని పేర్కొన్నాడు హిట్​మ్యాన్. రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి.. మళ్లీ యూ-టర్న్ తీసుకోవడం ఏంటో తనకు అర్థం కాదన్నాడు. తాను మాత్రం తన కెరీర్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నానని తెలిపాడు. టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పేశానని.. మళ్లీ ఆ ఫార్మాట్​లో అడుగుపెట్టేది లేదని మరోమారు స్పష్టం చేశాడు టీమిండియా కెప్టెన్. మరి.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ గురించి రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.