SNP
Rohit Sharma, Nahid Rana, IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు, బంగ్లా బౌలర్ నహీద్ రాణా మధ్య మంచి ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Rohit Sharma, Nahid Rana, IND vs BAN: బంగ్లాదేశ్‌తో జరగబోయే తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు, బంగ్లా బౌలర్ నహీద్ రాణా మధ్య మంచి ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
లాంగ్ గ్యాప్ తర్వాత టీమిండియా టెస్ట్ సిరీస్ కోసం బరిలోకి దిగబోతోంది. భారత్ – బంగ్లాదేశ్ మధ్య గురువారం(సెప్టెంబర్ 19) నుంచి రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ 2024 విజయం తర్వాత.. శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడింది. టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి.. వన్డే సిరీస్‌లో మాత్రం ఓటమి పాలైంది. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు ఉన్నా కూడా.. లంకతో టీమిండియా సిరీస్ కోల్పోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌పై అలాంటి తప్పు జరగొద్దని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయి.. రోహిత్ సేన టెస్ట్ సిరీస్ కోసం రెడీ అయింది. అయితే.. ఈ టెస్ట్ సిరీస్‌లో ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ చూసే అవకాశం ఉంది. అదే.. రోహిత్ శర్మ వర్సెస్ నహీద్ రాణా. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రాణా పేరును భారత క్రికెట్ అభిమానులు పెద్దగా విని ఉండరు.
కానీ, ఇటీవలె పాకిస్థాన్‌పై నహీద్ రాణా అద్భుతమైన బౌలింగ్‌తో.. పాక్ గడ్డపై బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించడంలో కీలక పాత్ర పోషించాడు. గంటకు 145 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ వేసే.. రాణా మంచి బౌలర్‌గా గుర్తింపు తెచుకుంటున్నాడు. అయితే.. ఇప్పుడు టీమిండియాతో సిరీస్ అతనికి గట్టి సవాల్ అని చెప్పవచ్చు. భారత్-బంగ్లా మధ్య తొలి టెస్టు మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. రోహిత్ శర్మ ఎలాగో స్పిన్‌ను బాగా ఆడగలడు. బాల్ టర్న్ అవుతున్నా.. అందుకు తగ్గట్లు తనని తాను అడ్జెస్ట్ చేసుకుంటూ, స్విప్ షాట్లతో బాగా ఆడతాడు. కానీ, పిచ్ ఆరంభంలో పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే.. బంగ్లా పేసర్ నహీద్ రాణా డేంజరస్‌గా మారే ప్రమాదం ఉంది.
రోహిత్ శర్మ స్పిన్ ఒక్కటే కాదు.. ఫేస్ బౌలింగ్‌ను కూడా రఫ్పాడిస్తాడనే విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్లాట్ పిచ్‌లపైనే పాకిస్థాన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన రాణా.. రోహిత్‌ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టగలడో చూద్దామని క్రికెట్ లోకం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు.. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే చెన్నై పిచ్‌ను మార్చి.. రోహిత్ శర్మ స్పీడ్ బౌలింగ్‌కు సహకరించే పిచ్‌తో బంగ్లాదేశ్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలని కూడా చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక వేళ అదే నిజమైతే.. రాణా మరింత డేంజరస్‌గా మారొచ్చు. అప్పుడు కూడా రోహిత్ అతన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఏది ఏమైనా.. భారత్-బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో రోహిత్ వర్సెస్ రాణా ఫైట్ మాత్రం ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. మరి ఈ ఫైట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Nahid Rana and Hasan Mahmud Destroyed Pakistani Batting in Rawalpindi 👏🏻
Nahid Rana is a “Generational Talent” for Bangladesh 🇧🇩 The Future is Bright for Nahid Rana ✨#PAKvBAN #PAKvsBAN pic.twitter.com/Xn2OewGJD2
— Richard Kettleborough (@RichKettle07) September 2, 2024