SNP
వన్డే వరల్డ్ కప్ తర్వాత భారీ అంచనాలతో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌తో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. అయితే.. రోహిత్ అవుటైన తీరు మాత్రం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
వన్డే వరల్డ్ కప్ తర్వాత భారీ అంచనాలతో సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌తో బరిలోకి దిగిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. అయితే.. రోహిత్ అవుటైన తీరు మాత్రం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
SNP
సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో మరీ దారుణంగా డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ శర్మ రబాడ బౌలింగ్‌లోనే అవుట్ కావడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో 5 రన్స్ చేసి రబాడ బౌలింగ్‌లో బర్గర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. ఇప్పుడు కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో రబాడ బౌలింగ్‌లో ఏకంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో.. రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్నాయి. అసలు సౌతాఫ్రికాలో టెస్ట్ మ్యాచ్ అంటే ఎందుకు రోహిత్ ఇంత దారుణంగా విఫలం అవుతున్నాడో అర్థం కావడం లేదంటూ క్రికెట్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ అవుటైన విధానం చూసి.. కామెంటేటర్లు సైతం షాక్ అయ్యాడు. నిజానికి అది అద్భుతమైన వికెట్ టేకింగ్ డెలవరీ ఏం కాదని, ఇదే బాల్‌ను ఇండియాలో అయి ఉంటే.. రోహిత్ శర్మ ఫ్లిక్ షాట్ ఆడి బౌండరీ కొట్టేవాడని, కానీ, ఇక్కడి మాత్రం వికెట్ సమర్పించుకున్నాడని కామెంటేటర్లు పేర్కొన్నాడు. సౌతాఫ్రికాలో బాల్‌లో కాస్త మూమెంట్ ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ అవుటై బాల్ స్వింగ్ కూడా కాలేదు. బాల్‌లో ఎలాంటి మూమెంట్ లేకపోయినా.. రోహిత్ వర్మ వికెట్ సమర్పించుకున్నాడు. ఇప్పటికే రోహిత్ శర్మకు సౌతాఫ్రికాలో టెస్ట్ క్రికెట్‌లో చెత్త రికార్డు ఉంది. దాన్ని మరింత బలపర్చుకున్నాడు హిట్‌మ్యాన్. ఈ డకౌట్ కంటే ముందు రోహిత్ శర్మ.. సౌతాఫ్రికాలో 9 టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఆడి కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు.
ప్రపంచంలో ఏ మూల ఆడినా అద్భుతంగా ఆడే రోహిత్ శర్మ.. ఒక్క సౌతాఫ్రికాలో అందులోనా టెస్ట్ క్రికెట్‌లో బ్యాటింగ్ చేసేందుకు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. 2013-14 మధ్య కాలంలో సౌతాఫ్రికా పర్యటనకు తొలి సారి వెళ్లిన రోహిత్ శర్మ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి 45 పరుగులు చేశాడు. జోహనెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 20. డర్బన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో 25 పరుగులు చేశాడు. మొత్తంగా ఆ రెండు టెస్టుల్లో 11.25 సగటుతో 45 పరుగులు మాత్రమే చేశాడు. 2017-18 మధ్య కాలంలో మరోసారి సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లి రెండు టెస్టులు ఆడాడు. అప్పుడు కూడా దారుణంగా విఫలం అయ్యాడు హిట్ మ్యాన్. కేప్‌టౌన్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 21 పరుగులు చేశాడు. సెంచూరియన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 57 పరుగులు చేశాడు. ఇప్పుడు తాజాగా సెంచూరియన్‌లోనే జరుగుతున్న తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ చేసిన పరుగులు కేవలం 5. మొత్తంగా 5 టెస్టులు పూర్తి చేసుకుని.. రోహిత్ కేవలం 128 పరుగులు మాత్రమే చేయడం అతని చెత్త రికార్డును సూచిస్తోంది.
అయితే.. రోహిత్ శర్మ ఇంత దారుణంగా విఫలం అవుతుండటంపై క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. పరుగులు చేయకపోవడం అంటుంచితే.. రెండు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ అవుటైన తీరు అతని అభిమానులను ఎక్కువగా బాధిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో తన ఫేవరేట్ షాట్ అయిన పుల్‌షాట్ ఆడబోయి అవుటైన రోహిత్.. రెండో ఇన్నింగ్స్ అయితే ఎప్పుడూ అవుట్ అవ్వని విధంగా ఒక నార్మల్ డెలవరీకి బౌల్డ్ అయ్యాడు. సాధారణంగా అయితే అలాంటి బాల్‌కు రోహిత్ అస్సలు వికెట్ ఇవ్వడు. అయితే.. రోహిత్ ఇంకా వన్డే వరల్డ్ కప్ 2023 ఓటమి నుంచి బయటికి రాలేదని, మానసికంగా బాగా దెబ్బతిన్న రోహిత్ బ్యాటింగ్‌పై కాన్సట్రేషన్ చేయలేకపోతున్నాడని.. అతనికి ఇంకాస్త సమయం అవసరం అని భారత క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నాడు. వరల్డ్ కప్ పోయిన బాధలో ఉన్న రోహిత్‌ను ముంబై ఇండియన్స్ మరింత బాధపెట్టిందని, అందుకే రోహిత్ ఇలా ఆడుతున్నాడంటూ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా.. రోహిత్ శర్మ తొలి టెస్ట్‌లో విఫలం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Once again, Kagiso Rabada dismisses Rohit Sharma.
Indian skipper departs for a duck.
📸: Disney + Hotstar pic.twitter.com/79oT8n2gm8
— CricTracker (@Cricketracker) December 28, 2023