iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఘోర అవమానం! కనీసం చోటు కూడా ఇవ్వలేదు!

  • Published Feb 19, 2024 | 7:12 PM Updated Updated Feb 19, 2024 | 8:15 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఘోర అవమానం జరిగింది. తాజాగా ఇంగ్లండ్‌పై టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉన్న టైమ్‌లో ఈ విషయం రోహిత్‌ అభిమానులను బాధిస్తోంది. ఈ విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఘోర అవమానం జరిగింది. తాజాగా ఇంగ్లండ్‌పై టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచి ఫుల్‌ జోష్‌లో ఉన్న టైమ్‌లో ఈ విషయం రోహిత్‌ అభిమానులను బాధిస్తోంది. ఈ విషయం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Feb 19, 2024 | 7:12 PMUpdated Feb 19, 2024 | 8:15 PM
Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఘోర అవమానం! కనీసం చోటు కూడా ఇవ్వలేదు!

ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఊహించని షాక్‌ తగిలింది. అందుకు కారణం మాజీ క్రికెటర్లు, జర్నలిస్టులు సంయుక్తంగా ఐపీఎల్‌ గ్రేటెస్ట్‌ టీమ్‌ ఎలెవెన్‌ను ప్రకటించడమే. ఐపీఎల్‌ 16 సీజన్లు పూర్తి చేసుకుని.. 17వ సీజన్‌లోకి అడుగుపెడుతున్న సందర్భంగా వసీం అక్రమ్‌, డేల్‌ స్టెయిన్‌, మ్యాథ్యూ హేడెన్‌, టామ్‌ మూడీతో పాటు సుమారు ఒక 70 మంది జర్నలిస్టులతో కూడిన ఒక బృందం తాజాగా ఐపీఎల్‌ ఆల్‌ టైమ్‌ గ్రేటెస్ట్‌ ఎలెవన్‌ను ప్రకటించింది.

ఈ టీమ్‌లో చాలా మంది భారత క్రికెటర్లకు చోటు దక్కింది. కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేశారు. ధోనితో పాటు విరాట్‌ కోహ్టీ, క్రిస్‌ గేల్‌, డేవిడ్‌ వార్నర్‌, సురేష్‌ రైనా, ఏబీ డివిలియర్స్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్‌ పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌, సునీల్‌ నరైన్‌, లసిత్‌ మలింగా, జస్ప్రీత్‌ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌లకు ఈ టీమ్‌లో చోటు దక్కింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ధోని ఐపీఎల్‌లో ఐదు వేలకు పైగా పరుగులు చేయడంతో పాటు 133 విజయాలు సాధించి, అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ఉన్నాడు.

అలాగే ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ ఉన్నాడు. అత్యధిక పరుగులు చేసిన విదేశి ఆటగాడి జాబితాలో డేవిడ్‌ వార్నర్‌కి టీమ్‌లో చోటు దక్కింది. సురేష్‌ రైనాకు ఎలాగూ మిస్టర్‌ ఐపీఎల్‌ అనే బిరుదు ఉండనే ఉంది. ఇక ఏబీ డివిలియర్స్‌ సైతం సూపర్‌ స్ట్రైక్‌ రేట్‌తో ఐపీఎల్‌పై తన ముద్ర వేశాడు. అయితే.. టీమ్‌ అంతా బాగానే ఉన్నా.. ధోనితో సమానంగా, ఇన్‌ఫ్యాక్ట్‌ ధోని కంటే ముందే ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్‌ టైటిల్స్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మాత్రం ఈ గ్రేటెస్ట్‌ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఈ విషయంపైనే రోహిత్‌ శర్మ అభిమానులు ఫీలవుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.