iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ఓడిపోయిన కొన్ని గంటల్లోనే.. రోహిత్, కోహ్లీకి అరుదైన గౌరవం!

  • Author Soma Sekhar Published - 05:36 PM, Mon - 20 November 23

ప్రపంచ కప్ ఓడిపోయిన కొన్ని గంటల్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటుగా మరికొంతమంది ప్లేయర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ కప్ ఓడిపోయిన కొన్ని గంటల్లోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటుగా మరికొంతమంది ప్లేయర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 05:36 PM, Mon - 20 November 23
వరల్డ్ కప్ ఓడిపోయిన కొన్ని గంటల్లోనే.. రోహిత్, కోహ్లీకి అరుదైన గౌరవం!

టీమిండియా ముచ్చటగా మూడో వరల్డ్ కప్ ను ముద్దాడుతుందని, ప్రతీ ఒక్క భారతీయుడు కలలు కన్నాడు. కానీ ఫైనల్ పోరులో టీమిండియాకు షాకిచ్చి.. ప్రపంచ కప్ ను ఎగరేసుకుపోయింది ఆస్ట్రేలియా. ఐదు సార్లు వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న ఆసీస్.. 6వ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. నిరాశగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తుచేసింది కంగారూ టీమ్. ఇక ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు భారతీయులు. ఇలాంటి టైమ్ లో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు కొన్ని వార్తలు ఊరటనిస్తున్నాయి. ప్రపంచ కప్ ఓడిపోయిన కొన్ని గంటల్లోనే టీమిండియా సారథి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అరుదైన గౌరవం పొందారు. వీరితో పాటుగా మరికొంతమంది భారత ఆటగాళ్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయి తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా ఫ్యాన్స్ కు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని చెప్పుకొచ్చింది ఐసీసీ. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 2023 ప్రపంచ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ను ప్రకటించింది ఐసీసీ. ఈ టీమ్ లో భారత జట్టు నుంచే ఆరుగులు ఆటగాళ్లు ఉండటం విశేషం. అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు చోటు దక్కించుకున్నారు. మిగతా ప్లేయర్ల విషయానికి వస్తే.. సౌతాఫ్రికా నుంచి దంచికొట్టిన క్వింటన్ డికాక్, కివీస్ నుంచి డార్లీ మిచెల్, ఆసీస్ టీమ్ నుంచి ఆడమ్ జంపా, గ్లెన్ మాక్స్ వెల్ లతో పాటుగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ 5లో ఉన్న దిల్షాన్ మధుషంక ఉన్నారు.

కాగా.. 12 ప్లేయర్ గా సఫారీ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని తీసుకున్నారు. ఇక ఈ టీమ్ కు సారథిగా రోహిత్ శర్మను ఎంపిక చేసింది ఐసీసీ. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? గత వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లోనూ రోహిత్, బుమ్రాలు చోటు దక్కించుకోవడం గమనార్హం. దీంతో వరల్డ్ కప్ పోయిన కొన్ని గంటల్లోనే అరుదైన గౌరవం దక్కించుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఈ మెగాటోర్నీలో రోహిత్ ఇటు కెప్టెన్ గా, అటు బ్యాటర్ గా అద్భుతమైన ఆటతీరుతో జట్టును ముందుకు నడిపించాడు. టోర్నీలో 597 రన్స్ చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ 5లో నిలిచాడు. ఇక కోహ్లీ ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. 11 మ్యాచ్ ల్లో మూడు సెంచరీలతో సహా.. 90.31 సగటుతో 765 పరుగులు బాదాడు కోహ్లీ. మరి ఈ ఘనత సాధించిన టీమిండియా ఆటగాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.