iDreamPost
android-app
ios-app

వీడియో: పొట్ట తగ్గించి మరింత ఫిట్‌గా మారిన రోహిత్‌ శర్మ! లుక్‌ అదుర్స్‌..

  • Published Sep 04, 2024 | 6:05 PM Updated Updated Sep 04, 2024 | 6:05 PM

Rohit Sharma, Fitness, IND vs BAN: టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. సూపర్‌ ఫిట్‌గా మారిపోయాడు. అతని లుక్స్‌ చూసి సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Rohit Sharma, Fitness, IND vs BAN: టీమిండియా వన్డే, టెస్ట్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. సూపర్‌ ఫిట్‌గా మారిపోయాడు. అతని లుక్స్‌ చూసి సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Sep 04, 2024 | 6:05 PMUpdated Sep 04, 2024 | 6:05 PM
వీడియో: పొట్ట తగ్గించి మరింత ఫిట్‌గా మారిన రోహిత్‌ శర్మ! లుక్‌ అదుర్స్‌..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌తో తిరిగి గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత.. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆడిన రోహిత్‌.. ఆ సిరీస్‌ ఓటమితో కాస్త నిరాశ చెందాడు. కానీ, బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో ఎలాగైనా రాణించి, టీమ్‌ను గెలిపించాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఎలాగో రోహిత్‌ శర్మ టీ20 క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో.. ఇక అతని ఫోకస్‌ మొత్తం వన్డేలు, టెస్టులపైనే ఉంది. ఈ క్రమంలో రోహిత్‌ తన ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా రోహిత్‌ శర్మ ఫుల్‌ ఫిట్‌గా ఉన్న ఫొటోలు వీడియోలు బయటికి వచ్చాయి. శ్రీలంకతో వన్డే సిరీస్‌ తర్వాత.. దొరికిన టైమ్‌ను పూర్తిగా ఫిట్‌నెస్‌పైనే పెట్టినట్లు కనిపిస్తోంది. అందుకే.. చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నాడు ఆ వీడియోస్‌లో. పొట్టను కూడా తగ్గించి.. మంచి ఫిజిక్‌తో రోహిత్‌ కనిపిస్తుండటంతో రోహిత్‌ శర్మ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. గతంలో రోహిత్‌ వర్మ కాస్త లావుగా ఉండటంతో పాటు పొట్ట కూడా ఉండేది. అది చూసి.. రోహిత్‌ శర్మను వడాపావు అని కూడా ట్రోలింగ్‌ చేసేవాళ్లు.

కానీ, ఇప్పుడు రోహిత్‌ ఫిజిక్‌ చూస్తే.. అలాంటి ట్రోలింగ్‌ చేయలేరు. పాతికేళ్ల కుర్రాడిలా మారిపోయాడు రోహిత్‌. బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌ తర్వాత.. టీమిండియాకు బిజీ షెడ్యూల్‌ ఉంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీతో పాటు వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2025 కూడా ఉంది. దీంతో.. రోహిత్‌ శర్మ తనకు దొరికి గ్యాప్‌ను బాడీని రెడీ చేసి.. ఫుల్‌ ఫిట్‌ నెస్‌ సాధించడం కోసం వెచ్చించాడు. కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఓ పార్క్‌లో రోహిత్‌ శర్మ రన్నింగ్‌ చేస్తున్న వీడియో కూడా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. మరి స్లిమ్‌గా మారిన రోహిత్‌ శర్మపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet