iDreamPost
android-app
ios-app

రోహిత్​కు అన్యాయం చేస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదు: గిల్​క్రిస్ట్

  • Published Jun 25, 2024 | 9:54 PMUpdated Jun 25, 2024 | 9:54 PM

టీ20 వరల్డ్ కప్​లో టీమిండియాను ఒంటిచేత్తో సెమీస్​కు చేర్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అద్భుతమైన బ్యాటింగ్​తో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్​లో జట్టుకు విజయాన్ని అందించాడు.

టీ20 వరల్డ్ కప్​లో టీమిండియాను ఒంటిచేత్తో సెమీస్​కు చేర్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అద్భుతమైన బ్యాటింగ్​తో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్​లో జట్టుకు విజయాన్ని అందించాడు.

  • Published Jun 25, 2024 | 9:54 PMUpdated Jun 25, 2024 | 9:54 PM
రోహిత్​కు అన్యాయం చేస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదు: గిల్​క్రిస్ట్

పొట్టి ప్రపంచ కప్​లో భారత జట్టు హవా నడుస్తోంది. వరుస విజయాలతో గ్రూప్ దశలో అదరగొట్టిన రోహిత్ సేన.. సూపర్-8లో అదే రేంజ్​లో దుమ్మురేపింది. వరుసగా ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీస్​లోకి సగర్వంగా అడుగుపెట్టింది. నాకౌట్ మ్యాచ్​లో ఇంగ్లండ్​ను ఫేస్ చేయనుంది భారత్. ఈ మ్యాచ్​లో గనుక విజయం సాధిస్తే ఫైనల్​కు చేరుకుంటుంది. గత టీ20 ప్రపంచ కప్​లో ఇంగ్లీష్ టీమ్ చేతుల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది మెన్ ఇన్ బ్లూ. సెమీస్​లో ఆ టీమ్​ను చిత్తు చేసి ఫైనల్​కు దూసుకెళ్లాలని చూస్తోంది. అయితే భారత్​ ఇంతవరకు చేరుకుందంటే అందుకు బౌలర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. బ్యాటింగ్​లో ఫర్వాలేదనిపించిన హిట్​మ్యాన్.. సారథ్యంలో మాత్రం సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకున్నాడు.

గ్రూప్ స్టేజ్​తో పాటు సూపర్-8లోనూ పర్ఫెక్ట్ ఫీల్డింగ్ పొజిషన్స్, కరెక్ట్ బౌలింగ్ ఛేంజెస్​తో ప్రత్యర్థులను హడలెత్తించాడు రోహిత్. కెప్టెన్​గా అతడి ప్రతిభ జట్టుకు పెద్ద బలంగా మారింది. ఇక, ఆసీస్​ మీద 41 బంతుల్లో 92 పరుగుల విధ్వంసంతో తన బ్యాట్​కు ఇంకా పదును తగ్గలేదని ప్రూవ్ చేశాడు. నాకౌట్​కు ముందు భీకర ఫామ్​లోకి వచ్చాడు. దీంతో అతడ్ని చూసి అందరూ భయపడుతున్నారు. ఈ తరుణంలో భారత కెప్టెన్ గురించి ఆస్ట్రేలియా లెజెండ్ ఆడమ్ గిల్​క్రిస్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడుఏ. రోహిత్​కు అన్యాయం చేస్తున్నారని అతడు సీరియస్ అయ్యాడు. ఇది కరెక్ట్ కాదన్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో టీమిండియాను రోహిత్ ముందుండి నడిపిస్తున్న తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు గిల్లీ. అయితే అతడికి అందాల్సినంత క్రెడిట్ అందడం లేదన్నాడు.

‘టీ20 ప్రపంచ కప్​లో రోహిత్ సారథ్యం అదుర్స్. కెప్టెన్​గా అతడు టీమ్​ను నడిపిస్తున్న తీరు అద్భుతం. కానీ కెప్టెన్​గా అతడికి అంతగా క్రెడిట్ ఇవ్వట్లేదు. భారత బౌలింగ్ టైమ్​లో రోహిత్ పన్నుతున్న వ్యూహాలు, ప్లానింగ్​ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో 182 పరుగుల్ని డిఫెండ్ చేస్తూ అతడు బౌలర్లను రొటేట్ చేసిన తీరు చాలా బాగుంది. పొట్టి కప్పు ఫస్ట్ ఫేజ్​ జరిగిన యూఎస్​ఏలో కుల్దీప్ యాదవ్​కు అవకాశాలు దక్కలేదు. కానీ వెస్టిండీస్​కు రాగానే అతడ్నే ప్రధాన అస్త్రంగా వాడుతున్నాడు రోహిత్. గత రెండు మ్యాచుల్లోనూ కుల్దీప్ కీలక బ్యాటర్లను పెవిలియన్​కు పంపించాడు. అయితే ఇందుకు రోహిత్​కు క్రెడిట్ ఇవ్వాలి. అందుబాటులో ఉన్న ప్లేయర్లను అవసరానికి తగ్గట్లు వాడుకోవడం, బౌలర్లను సరైన టైమ్​లో రొటేట్ చేయడం, అతడి బ్రిలియంట్ కెప్టెన్సీ కారణంగానే భారత్​ దూసుకెళ్తోంది’ అని గిల్​క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. మరి.. రోహిత్​కు సరైన క్రెడిట్ ఇవ్వట్లేదంటూ గిల్లీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి