iDreamPost
android-app
ios-app

దిగ్గజం, గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ అంటూ రోహిత్‌ను ఆకాశానికెత్తేసిన మాజీ క్రికెటర్‌!

  • Published Aug 01, 2024 | 3:39 PM Updated Updated Aug 01, 2024 | 3:39 PM

Rohit Sharma, Ravi Shastri: భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మను భారత మాజీ క్రికెటర్‌ ఆకాశానికి ఎత్తేశాడు. అతనో దిగ్గజం, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. మరి ఆ మాజీ క్రికెటర్‌ ఎవరు? ఎందుకు రోహిత్‌ను పొగిడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Ravi Shastri: భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మను భారత మాజీ క్రికెటర్‌ ఆకాశానికి ఎత్తేశాడు. అతనో దిగ్గజం, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. మరి ఆ మాజీ క్రికెటర్‌ ఎవరు? ఎందుకు రోహిత్‌ను పొగిడాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 01, 2024 | 3:39 PMUpdated Aug 01, 2024 | 3:39 PM
దిగ్గజం, గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ అంటూ రోహిత్‌ను ఆకాశానికెత్తేసిన మాజీ క్రికెటర్‌!

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రస్తుతం శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు ఆ దేశంలో ఉన్నాడు. తన కెప్టెన్సీలో భారత్‌ను టీ20 ఛాంపియన్‌గా నిలిపిన తర్వాత.. తొలిసారి రోహిత్‌ తిరిగి గ్రౌండ్‌లోకి దిగబోతున్నాడు. అలాగే టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత.. ఆడుతున్న తొలి సిరీస్‌ కావడంతో భారత క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. నాలుగు రోజులు ముందుగానే లంక గడ్డపై అడుగుపెట్టిన రోహిత్‌ శర్మ.. తొలి మ్యాచ్‌ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్‌, మాజీ హెడ్‌ కోచ్‌, ప్రముఖ కామెంటేటర్‌ రవిశాస్త్రి.. రోహిత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘వైట్‌ బాల్‌ క్రికెట్‌(వన్డే, టీ20)లో రోహిత్‌ శర్మ ఒక జెయింట్‌(దిగ్గజం). ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకడు, ఎరాతో సంబంధం లేకుండా.. ఏ వైట్‌ బాల్‌ టీమ్‌లోనైనా అతనికి చోటు దక్కుతుంది. టాప్‌లో ఉండే అతని డైనమిక్‌ ఎబిలిటీనే అందుకు కారణం’ అంటూ రవిశాస్త్రి పేర్కొన్నారు. రోహిత్‌ శర్మ ఇటీవల అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కొంత కాలం పాటు వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతానని కూడా రోహిత్‌ ప్రకటించాడు. అయితే.. రోహిత్‌కు టెస్టుల్లో కంటే.. వన్డే, టీ20 క్రికెట్‌లోనే బెస్ట్‌ స్టాట్స్‌ ఉన్నాయి.

కెరీర్‌ ఆరంభంలో లోయర్‌ ఆర్డర్లో బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ.. ఓపెనర్‌గా అవకాశం వచ్చిన తర్వాత.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గతకొన్నేళ్లుగా టీమిండియాకు మూడు ఫార్మాట్లలో బెస్ట్‌ ఓపెనర్‌గా ఉన్నాడు. శిఖర్‌ ధావన్‌తో కలిసి చాలా కాలం పాటు ఓపెనర్‌గా ఆడిన రోహిత్‌ ఇప్పుడు.. యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ లాంటి యంగ్‌స్టర్లతో కూడా పోటీ పడి మరి అదరగొడుతున్నాడు. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చినా.. ఐపీఎల్‌లో తన సత్తా చాటనున్నాడు. అలాగే తాను ఆడిన చివరి టీ20 వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ ఎలాంటి ప్రదర్శన కనబర్చాడో మనంతా చూశాం. వన్డే వరల్డ్‌ కప్‌ 2027 వరకు రోహిత్‌ ఆడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. వన్డేల్లో తనకున్న రికార్డ్స్‌ బట్టి చూస్తే.. రోహిత్‌కు బాగా అచ్చొచ్చిన ఫార్మాట్‌ ఇదే. అందుకే రవిశాస్త్రి.. రోహిత్‌ను వైట్‌ బాల్‌ క్రికెట్‌లో జెయింట్‌ అని పేర్కొన్నాడు. మరి రోహిత్‌పై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.