రోహిత్ అంటే భయం! కోహ్లీ మాటలు లీక్ చేసిన అశ్విన్!

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లలో బాగా ఆడే బ్యాటర్‌ ఎవరనే ప్రశ్న ఎదురైతే.. సగటు క్రికెట్‌ అభిమాని చెప్పే సమాధానం మహేంద్ర సింగ్‌ ధోని. తొలుత బ్యాటింగ్‌ చేసినా, ఛేజింగ్ చేసినా.. చివరి ఓవర్లలో ధోనిని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ధోనికి బెస్ట్‌ ఫినిషర్‌ అనే పేరు కూడా ఉంది. అయితే.. టీ20 క్రికెట్‌లో చివరి ఓవర్లు అంటే.. 16 నుంచి 20 ఓవర్ల మధ్య, ప్రత్యర్థి కెప్టెన్‌ ఏ బ్యాటర్‌ను చూసి భయపడతాడో తెలుసా? అనే ప్రశ్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ అయిన కోహ్లీ నుంచి స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఎదురైంది. అశ్విన్‌ కూడా సగటు క్రికెట్‌ అభిమానిలా.. ఇంకేవరు ధోని అని బదులిచ్చాడు. కానీ, కోహ్లీ దానికి ఒప్పుకోలేదు. ఇంకో టీమిండియా క్రికెటర్‌ పేరు చెప్పాడు. ఈ విషయాన్ని స్వయంగా అశ్వినే వెల్లడించాడు.

తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘ఓ 5-6 ఏళ్ల క్రితం.. ఆ మ్యాచ్‌ ఏదో గుర్తు లేదు కానీ, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతను ఆడుతున్న తీరు చూసి.. ఒక బౌలర్‌గా ఇతనికి ఎక్కడ బాల్‌ వేస్తే అవుట్‌ అవుతాడు అని ఆలోచిస్తున్నాను. నా పక్కన ఉన్న కోహ్లీ.. ప్రత్యర్థి కెప్టెన్లకు నైట్‌మేర్‌ ఎవరో తెలుసా? అని అడిగాడు. దానికి నేను ధోని.. అని సమాధానం ఇచ్చాను. దానికి కోహ్లీ.. కాదు.. రోహిత్‌ శర్మ అని అన్నాడు. రోహిత్‌ టీ20 క్రికెట్‌లో 16 ఓవర్ల వరకు ఆడాడా.. ఆ తర్వాత అతనికి ఎక్కడ బాల్‌ వేయాలో, ఎవరితో బౌలింగ్‌ వేయించాలో ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కు అర్థం కాదు అని అన్నాడు.

నిజానికి కోహ్లీ చెప్పింది వంద శాతం నిజం. రోహిత్‌ శర్మ టీ20ల్లో 16 ఓవర్లు ఆడేస్తే.. ఆ తర్వాత అతనికి ఎక్కడ బాల్‌ వేసినా కొట్టేస్తాడు. ఎందుకంటే రోహిత్‌ వద్ద అన్ని షాట్లు ఉన్నాయి. ఎలాంటి బౌలర్‌ వేసినా, ఎక్కడ బాల్‌ వేసినా కొట్టేస్తాడు. ముఖ్యంగా రోహిత్‌ కొట్టే పుల్‌ షాట్‌ అయితే అద్భుతమనే చెప్పాలి. పుల్‌షాట్‌తో పాటు కవర్‌ డ్రైవ్‌ ఆడిన మ్యాచ్‌లో రోహిత్‌ బిగ్‌ స్కోర్‌ చేస్తాడనే నమ్మకం నాకు వస్తుంది. నాకు తెలిసి.. ఈ వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ శర్మ మరో డబుల్‌ సెంచరీ చేస్తాడని అనిపిస్తుంది.’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పేర్కొన్నాడు. మరి అ‍శ్విన్‌-కోహ్లీకి రోహిత్‌ గురించి సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: శివుడి థీమ్‌తో కొత్త క్రికెట్‌ స్టేడియం! విశేషాలు ఇవే..

Show comments