Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తక్కువ అంచనా వేస్తున్నారని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. హిట్‌మ్యాన్‌తో పెట్టుకోవద్దని అతడు ఒక్కొక్కరి తాట తీస్తాడని హెచ్చరించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను తక్కువ అంచనా వేస్తున్నారని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. హిట్‌మ్యాన్‌తో పెట్టుకోవద్దని అతడు ఒక్కొక్కరి తాట తీస్తాడని హెచ్చరించాడు.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024కు ముందు ఓ విషయం భారత అభిమానులను భయపెడుతోంది. అదే కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో హిట్‌మ్యాన్ ఫెయిల్ అయ్యాడు. బ్యాట్‌తో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 13 మ్యాచుల్లో కలిపి 349 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 145గా ఉంది. దీంతో అతడి ఫామ్ గురించి అందరూ టెన్షన్ పడుతున్నారు. ప్రపంచ కప్‌లోనూ ఇలాగే ఆడితే ఇక టీమ్ కప్పు కొట్టినట్లేనని కొందరు సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఓపెనర్‌గా వచ్చేటోడు, అందులోనూ కెప్టెనే ఇలా ఆడితే ఇంక మిగతా వాళ్ల మీద అది ఎంతగా ప్రభావం చూపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నాడు టామ్ మూడీ. అతడు కొన్ని మ్యాచుల్లోనే ఫామ్ అందుకుంటాడని అన్నాడు. ఒక్కసారి ఊపులోకి వస్తే ఇంకా ఎవరూ అతడ్ని ఆపలేరని.. బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకుపోతాడని మూడీ చెప్పాడు. ఫామ్‌లో లేడని రోహిత్‌ను తక్కువ అంచనా వేయొద్దని.. స్వింగ్‌లోకి వస్తే బౌలర్ల తాట తీస్తాడని హెచ్చరించాడు. ‘నేను రోహిత్ శర్మ ఫామ్ గురించి టెన్షన్ పడట్లేదు. ఐసీసీ వరల్డ్ కప్ లాంటి మేజర్ టోర్నీల్లో రోహిత్ ఎక్స్‌పీరియెన్స్ టీమ్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాట్‌తోనే కాదు.. సారథ్యంతోనూ తన మార్క్ చూపించే సత్తా అతడి సొంతం’ అని మూడీ పేర్కొన్నాడు.
వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలో చిన్న జట్లతో ఒకట్రెండు మ్యాచ్‌లు ఉంటాయి కాబట్టి వాటితో రోహిత్ ఫామ్‌లోకి వస్తాడని మూడీ తెలిపాడు. ఒక్కసారి మూమెంటమ్ అందుకుంటే అతడ్ని ఆపడం ఎవరి తరం కాదన్నాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో ప్లేయింగ్ ఎలెవన్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఆల్‌రౌండర్ల అవసరం ఉంటుందన్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యాను భారత్ ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకోవాలని సూచించాడు. టచ్‌లోకి వచ్చేందుకు పాండ్యాకు కూడా కొన్ని మ్యాచ్‌లు అవసరమని.. అప్పటిదాకా ఓపిక పట్టి, ప్రోత్సహిస్తే బాగుంటుందన్నాడు. అతడు బ్యాట్‌తో పాటు బాల్‌తోనూ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదని వివరించాడు. మరి.. రోహిత్‌ను తక్కువ అంచనా వేయొద్దంటూ మూడీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.