iDreamPost
android-app
ios-app

Rohit Sharma: ఇంగ్లండ్‌ భయమంతా ఒక్క రోహిత్‌ గురించే..! అదే రిపీట్‌ అయితే..

  • Published Jan 23, 2024 | 12:41 PM Updated Updated Jan 23, 2024 | 6:15 PM

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఒక విషయంలో ఇంగ్లండ్‌ జట్టును భయపెడుతున్నాడు. మరో రెండు రోజుల్లో భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విషయం ఆసక్తిగా మారింది. మరి ఏ విషయంలో రోహిత్‌ను చూసి ఇంగ్లండ్‌ భయపెడుతుందో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఒక విషయంలో ఇంగ్లండ్‌ జట్టును భయపెడుతున్నాడు. మరో రెండు రోజుల్లో భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విషయం ఆసక్తిగా మారింది. మరి ఏ విషయంలో రోహిత్‌ను చూసి ఇంగ్లండ్‌ భయపెడుతుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 23, 2024 | 12:41 PMUpdated Jan 23, 2024 | 6:15 PM
Rohit Sharma: ఇంగ్లండ్‌ భయమంతా ఒక్క రోహిత్‌ గురించే..! అదే రిపీట్‌ అయితే..

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ప్రతిష్టాత్మకమైన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ గురువారం నుంచి మొదలుకానుంది. తొలి మ్యాచ్‌.. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్‌ కోసం ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా.. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పైచేయి సాధిస్తే.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ పాయింట్ల పట్టికలో తొలి స్థానం కూడా సాధించే అవకాశం ఉండటంతో.. భారత్‌-ఇంగ్లండ్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే.. విరాట్‌ కోహ్లీ తొలి రెండు టెస్టులు ఆడకపోవడం గట్టి టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే.. టెస్టుల్లో కోహ్లీ టీమ్‌లో ఉండటం ఎంతో ముఖ్యం. కానీ, కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు.

కోహ్లీ లేకపోయినా.. ఇంగ్లండ్‌ జట్టును ఒక భయం వెంటాడుతోంది. ఆ భయం పేరే రోహిత్‌ శర్మ. స్వదేశంలో జరిగే టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు అద్భుతమైన ట్రాక్‌ రికార్డు ఉంది. టెస్ట్‌ అయినా.. వన్డే, టీ20 స్టైల్లో ఆడే రోహిత్‌ శర్మ.. సరైన బ్యాటింగ్‌ పిచ్‌ దొరకాలి కానీ విధ్వంసం సృష్టిస్తాడు. కాగా, తొలి టెస్ట్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ స్టేడియంలో జరగనున్న నేపథ్యంలో రోహిత్‌ శర్మ బ్యాటింగ్ శైలికి ఈ పిచ్‌ సరిగ్గా సరిపోతుంది. దీంతో.. తొలి మ్యాచ్‌లోనే రోహిత్‌ శర్మ తన సత్తా చాటే అవకాశం ఉంది. తాజగా ఆఫ్ఘనిస్థాన్‌తో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ చివరి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.

Rohit is beating England!

అదే ఫామ్‌ను ఇంగ్లండ్‌పై టెస్టుల్లోనూ కొనసాగిస్తే.. ఇంగ్లీష్‌ జట్టుకు ఇక దబిడిదిబిడే. అయితే.. టీమ్‌లో విరాట్‌ కోహ్లీ లేకపోయినా.. ఇంగ్లండ్‌ను రోహిత్‌ శర్మ అంతలా ఎలా కంగారు పెట్టగలుగుతున్నాడు అంటే.. టెస్టుల్లో ఇంగ్లండ్‌పై రోహిత్‌ శర్మకు ఉన్న బ్యాటింగ్‌ యావరేజే అందుకు కారణం. టెస్ట్‌ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై రోహిత్‌ శర్మకు ఏకంగా 49.80 బ్యాటింగ్‌ యావరేజ్‌ ఉంది. ఈ సగటుతో రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌పై చెలరేగితే.. అతన్ని అడ్డుకోవడం ఇంగ్లండ్‌ బౌలర్లకు దాదాపు అసాధ్యమే. ఎందుకంటే.. రోహిత్‌ ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే.. అతన్ని అవుట్‌ బౌలర్ల వల్ల కాదు. అతనే ఏదైనా తప్పు షాట్‌ అడి అవుట్‌ అవ్వాలి కానీ, అతన్ని అవుట్‌ చేయడం బౌలర్ల వల్ల కాదు. ఇదే విషయాన్ని రోహిత్‌ స్వయంగా చెప్పి, అనేక సార్లు నిరూపించాడు కూడా. మరి ఇంగ్లండ్‌పై రోహిత్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.