Rohit Sharma: అక్కడే మ్యాచ్ పోయింది.. రోహిత్ వల్లే టీమిండియాకు ఓటమి: పాక్ క్రికెటర్

India vs Sri Lanka: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్​లో భారత్ కష్టాల్లో పడింది. ఈజీగా గెలవాల్సిన మొదటి మ్యాచ్ టై కాగా.. రెండో మ్యాచ్​లో ఆతిథ్య జట్టు స్పిన్ వలలో చిక్కుకొని ఓటమి పాలైంది రోహిత్ సేన.

India vs Sri Lanka: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్​లో భారత్ కష్టాల్లో పడింది. ఈజీగా గెలవాల్సిన మొదటి మ్యాచ్ టై కాగా.. రెండో మ్యాచ్​లో ఆతిథ్య జట్టు స్పిన్ వలలో చిక్కుకొని ఓటమి పాలైంది రోహిత్ సేన.

శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్​లో భారత్ కష్టాల్లో పడింది. ఈజీగా గెలవాల్సిన మొదటి మ్యాచ్ టై కాగా.. రెండో మ్యాచ్​లో ఆతిథ్య జట్టు స్పిన్ వలలో చిక్కుకొని ఓటమి పాలైంది రోహిత్ సేన. దీంతో సిరీస్​లో 0-1తో వెనుకంజలో ఉంది. ఎల్లుండి జరిగే మూడో వన్డేలో గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. రిజల్ట్ ఏమాత్రం అటు ఇటైనా సిరీస్ పోవడం ఖాయం. అందుకే ఆ మ్యాచ్​లో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దని భారత్ భావిస్తోంది. తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్​తో లంకను ఓడించాలని చూస్తోంది. స్పిన్ వ్యూహాన్ని ఛేదించి ఆతిథ్య జట్టును మడతబెట్టాలని అనుకుంటోంది. అందుకోసం అవసరమైన స్ట్రాటజీలు పన్నడంలో కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ బిజీ అయిపోయారు.

మూడో వన్డే కోసం ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్​తో వెళ్లాలి? జట్టులో చేయాల్సిన మార్పులు? లంక స్పిన్నర్లను ఆపేందుకు అవసరమైన వ్యూహాలను పన్నడంలో హిట్​మ్యాన్​ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తొలి రెండు మ్యాచుల్లో రోహిత్ అప్రోచ్​ను అతడు తప్పుబట్టాడు. అంత మంచి ఫామ్​లో ఉండి, పరుగులు ఈజీగా వస్తున్న టైమ్​లో ఆఖరి వరకు క్రీజులో ఉండకపోవడం ఏంటని ప్రశ్నించాడు. రోహిత్ మ్యాచ్​లు ఫినిష్ చేస్తే అయిపోయేదని.. చేతులారా ఆ అవకాశాన్ని అతడు మిస్ చేసుకున్నాడని తెలిపాడు. భారత్ ఓటమికి అతడే కారణమని విమర్శించాడు సల్మాన్ భట్.

‘తొలి రెండు వన్డేల్లోనూ రోహిత్ శర్మ చాలా బాగా ఆడాడు. బౌలర్లను నిలదొక్కుకోండా చేశాడు. ధనాధన్ ఇన్నింగ్స్​లతో అలరించాడు. అయితే అతడో తప్పు చేశాడు. ముఖ్యంగా రెండో వన్డేలో మ్యాచ్​ను ఫినిష్ చేసే ఛాన్స్ ఉన్నా అతడు వాడుకోలేదు. అంత మంచి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ వచ్చిన హిట్​మ్యాన్​.. మ్యాచ్​ను ముగించే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదు. టీమిండియా బ్యాటర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారని అతడికి తెలుసు. అలాంటప్పుడు మరింత బాధ్యత తీసుకొని ఇన్నింగ్స్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్​ను ఫినిష్ చేయాల్సింది. కానీ అతడు చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. అక్కడే మ్యాచ్ పోయింది’ అని భట్ చెప్పుకొచ్చాడు. అతడి తప్పే భారత్​ కొంపముంచిందన్నాడు. రెండో వన్డేలో 44 బంతుల్లో 64 పరుగులు చేసిన హిట్​మ్యాన్.. వండర్సే బౌలింగ్​లో రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. మరి.. రోహిత్ మ్యాచ్​ను ఫినిష్ చేయాల్సిందనే వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments