iDreamPost
android-app
ios-app

Shubman Gill: ఆ ఇద్దరే నా హీరోలు.. వాళ్లలా టీమ్​ను గెలిపించాలని అనుకుంటున్నా: గిల్

  • Published Aug 05, 2024 | 8:27 PM Updated Updated Aug 05, 2024 | 8:27 PM

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​కు ఇటీవలే బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించింది. తొలి సిరీస్​లోనే అతడు ఈ రోల్​లో ఆకట్టుకుంటున్నాడు.

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​కు ఇటీవలే బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించింది. తొలి సిరీస్​లోనే అతడు ఈ రోల్​లో ఆకట్టుకుంటున్నాడు.

  • Published Aug 05, 2024 | 8:27 PMUpdated Aug 05, 2024 | 8:27 PM
Shubman Gill: ఆ ఇద్దరే నా హీరోలు.. వాళ్లలా టీమ్​ను గెలిపించాలని అనుకుంటున్నా: గిల్

టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్​కు ఇటీవలే బీసీసీఐ ప్రమోషన్ ఇచ్చింది. టీ20లు, వన్డేల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించింది. తొలి సిరీస్​లోనే అతడు ఈ రోల్​లో ఆకట్టుకుంటున్నాడు. గత కొన్నేళ్లుగా కన్​సిస్టెంట్​గా రన్స్ చేయడం, మూడు ఫార్మాట్లలోనూ నమ్మదగిన ఆటగాడిగా ఎదగడం, ఎంత ఒత్తిడిలోనూ కూల్​గా ఉండగలగడం, ఓపికతో ఉంటూ అందరితో కలసిపోవడం లాంటి లక్షణాల్ని చూసి అతడికి ప్రమోషన్ ఇచ్చింది బోర్డు. ఐపీఎల్​లో గుజరాత్ టైటాన్స్​కు కెప్టెన్​గా పని చేసిన అనుభవం ఉండటం కూడా అతడికి కలిసొచ్చింది. శ్రీలంక సిరీస్​తో వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని చేపట్టిన గిల్​ మిక్స్​డ్ రిజల్ట్స్ చూస్తున్నాడు.

లంక టూర్​లో ఉన్న భారత్.. టీ20 సిరీస్​ను క్లీన్​స్వీప్ చేయగా, వన్డే సిరీస్​లో 1-0తో వెనుకబడింది. ఈ రెండు సిరీస్​ల్లోనూ వైస్ కెప్టెన్​గా ఉన్న శుబ్​మన్ గిల్ బ్యాటర్​గా ఫర్వాలేదనిపించాడు. ఓపెనర్​గా వస్తూ క్విక్ స్టార్ట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు. టీమ్​కు సంబంధించిన కీలక నిర్ణయాల విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. హిట్​మ్యాన్ నుంచి సారథ్య పాఠాలు నేర్చుకుంటున్నాడు. అలాంటోడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్​లో రోహిత్, విరాట్ కోహ్లీలే తనకు ఇన్​స్పిరేషన్ అని అన్నాడు. వాళ్లే తన హీరోలని చెప్పాడు. ఆ ఇద్దరి బాటలో నడుస్తూ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాలని అనుకుంటున్నానని తెలిపాడు.

Gill

రోహిత్-విరాట్​లు నాకు స్ఫూర్తి. వాళ్లే నాకు రోల్ మోడల్స్. ఆ ఇద్దరి మాదిరిగా ఫుల్ ఇంటెన్సిటీతో ఆడుతూ భారత్​కు ఎన్నో విజయాలు అందించాలని అనుకుంటున్నా. ఈ ఆలోచనే నన్ను బాగా ఆడేందుకు ప్రేరేపిస్తోంది’ అని గిల్ చెప్పుకొచ్చాడు. రోహిత్ సారథ్యంలో మ్యాచులు ఆడటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపాడు. హిట్​మ్యాన్​తో పాటు మహేంద్ర సింగ్ ధోని, కోహ్లీ లాంటి దిగ్గజాలు భారత జట్టుకు నాయకత్వం వహించారని.. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు గిల్. కెప్టెన్సీ అంటే తనకు ఇష్టమని.. ఆ రోల్​లో ఉంటే గేమ్​ను మరింత ఆస్వాదించొచ్చని వివరించాడు. ఇక, లంకతో వన్డే సిరీస్​లో తొలి వన్డేలో 16 పరుగులు చేసిన గిల్.. రెండో వన్డేలో 35 పరుగులు చేశాడు. అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. సిరీస్ డిసైడర్​లో అతడు చెలరేగుతాడేమో చూడాలి.