iDreamPost
android-app
ios-app

ICC ర్యాంకింగ్స్​లో టీమిండియా హవా.. టాప్-4లో ముగ్గురు మనోళ్లే!

  • Published Aug 07, 2024 | 5:24 PM Updated Updated Aug 07, 2024 | 5:24 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్​కు కాస్త గ్యాప్ ఇచ్చిన హిట్​మ్యాన్.. శ్రీలంక సిరీస్​తో మళ్లీ అలరిస్తున్నాడు. ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే అందుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్​కు కాస్త గ్యాప్ ఇచ్చిన హిట్​మ్యాన్.. శ్రీలంక సిరీస్​తో మళ్లీ అలరిస్తున్నాడు. ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే అందుకున్నాడు.

  • Published Aug 07, 2024 | 5:24 PMUpdated Aug 07, 2024 | 5:24 PM
ICC ర్యాంకింగ్స్​లో టీమిండియా హవా.. టాప్-4లో ముగ్గురు మనోళ్లే!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్​కు కాస్త గ్యాప్ ఇచ్చినా మళ్లీ శ్రీలంక సిరీస్​తో అలరిస్తున్నాడు హిట్​మ్యాన్. ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడే అందుకున్నాడు. లంకతో జరుగుతున్న వన్డే సిరీస్​తో కమ్​బ్యాక్ ఇచ్చిన అతడు.. తొలి రెండు వన్డేల్లో రెండు ఫిఫ్టీలు బాదేశాడు. 134 స్ట్రైక్​ రేట్​తో ఆడుతూ 122 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా ఫెయిలైన చోట రోహిత్ మాత్రం ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాల్లేకుండా అందర్నీ మడతబెట్టేస్తున్నాడు. బౌండరీలు, సిక్సుల వర్షం కురిపిస్తూ స్లో పిచ్​లపై ఎలా బ్యాటింగ్ చేయాలో నేర్పిస్తున్నాడు. అలాంటోడు ఐసీసీ ర్యాంకింగ్స్​లోనూ సత్తా చాటాడు.

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. 763 రేటింగ్ పాయింట్స్​తో టాప్-3లోకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలో మరో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (752 పాయింట్లు)ను హిట్​మ్యాన్ అధిగమించాడు. టాప్ బ్యాటర్స్ లిస్ట్​లో కోహ్లీ నాలుగో స్థానంలో నిలవగా.. భారత యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్ (782 పాయింట్లు) సెకండ్ ప్లేస్​లో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (824) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​-4లో గిల్, రోహిత్, కోహ్లీ రూపంలో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ ఫార్మాట్​లో బౌలర్ల ర్యాంకింగ్స్​లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4వ స్థానంలో నిలిచాడు.

Rohith kohli

లంక సిరీస్​లో రాణిస్తున్న స్పిన్ ఆల్​రౌండర్ వాషింగ్టన్ సుందర్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్​లో 45 స్థానాలు మెరుగుపర్చుకొని 97వ స్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో వన్డేలో భారత్​ను చావుదెబ్బ తీసిన జెఫ్రీ వాండర్సే 64 స్థానాలు మెరుగుపర్చుకొని 104వ స్థానానికి చేరుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్ గురించి తెలిసిన భారత ఫ్యాన్స్​ మన బ్యాటర్లను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. టాప్-4లో ముగ్గురు మనోళ్లే ఉండటాన్ని బట్టి టీమిండియా డామినేషన్ ఏ లెవల్​లో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. టాప్​-3లోకి దూసుకొచ్చిన హిట్​మ్యాన్​ దూకుడు మామూలుగా లేదని చెబుతున్నారు. అతడు లంక సిరీస్​లో ఆడుతున్న తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఐసీసీ ర్యాంకింగ్స్​లో భారత్ హవా నడుస్తుండటంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.