SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్ధిక్ పాండ్యాపై రివేంజ్‌కు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ దెబ్బతో పాండ్యా ముంబై నుంచి కాదు.. ఏకంగా టీమిండియా నుంచే వెళ్లిపోతాడంటూ పేర్కొంటున్నారు. మరి పాండ్యాకు చెక్ పెట్టేందుకు రోహిత్ అంతలా ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. హార్ధిక్ పాండ్యాపై రివేంజ్‌కు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ దెబ్బతో పాండ్యా ముంబై నుంచి కాదు.. ఏకంగా టీమిండియా నుంచే వెళ్లిపోతాడంటూ పేర్కొంటున్నారు. మరి పాండ్యాకు చెక్ పెట్టేందుకు రోహిత్ అంతలా ఏం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ.. ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టడనే విషయం క్రికెట్ వర్గాల్లో ఉంది. అయితే.. కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు రోహిత్‌ను కాస్త బాధపెట్టి ఉంటాయి. ముఖ్యంగా వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఓటమి రోహిత్‌ను తీవ్రంగా బాధించి ఉంటే.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ యాజమాన్యం చేసిన పని మాత్రం రోహిత్‌ను మరింత బాధించింది. అదేంటంటే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీమ్‌లో ఉండగానే.. అతని స్థానంలో జట్టును వదిలివెళ్లిన హార్ధిక్ పాండ్యాను మళ్లీ తిరిగి టీమ్‌లోకి తీసుకొచ్చి.. అతనికి కెప్టెన్సీ ఇవ్వడం ఎవరినైనా బాధిస్తుంది. రోహిత్ శర్మ అభిమానులు అయితే.. ఈ అవమాన్ని భరించలేక ముంబైని సోషల్ మీడియాలో అన్‌ఫాలో కొట్టేశారు. కానీ, రోహిత్ మాత్రం మౌనం వహించాడు.
అయితే.. ఈ క్రమంలోనే రోహిత్ తీసుకున్న ఒక నిర్ణయం ఏకంగా పాండ్యా కెరీర్‌నే ప్రమాదంలో పడేసేలా ఉందని గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు? పాండ్యా కెరీర్ ఎందుకు ప్రమాదంలో పడుతుంది? క్రికెట్ అభిమానులు ఎలా లింక్ చేస్తున్నారో? ఇప్పుడు తెలుసుకుందాం. గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మధ్యలోనే గాయం కారణంగా పాండ్యా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. మళ్లీ తిరిగి ఇప్పటి వరకు జట్టులోకి రాలేదు. ఐపీఎల్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ గ్యాప్‌లోనే రోహిత్.. పాండ్యా కెరీర్‌ను క్లోజ్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్లు క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అది ఎలాగంటే..
ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం కూడా సాధించి.. ఆదివారం రెండో మ్యాచ్‌కు సిద్ధం అవుతోంది. అయితే.. తొలి మ్యాచ్‌లో టీమిండియా కుర్రాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా యువ సంచలనం.. శివమ్ దూబే బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. ముందుగా బౌలింగ్‌లో రెండు ఓవర్లు వేసిన శివమ్ దూబే కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో ఏకంగా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ.. అద్భుత ఇన్నింగ్స్‌తో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను గెలిపించాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. శివమ్ సక్సెస్ వెనుక రోహిత్ ప్రొత్సాహం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒక మ్యాచ్ ఫినిషర్ కమ్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబేను రోహిత్ శర్మ ప్రమోట్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. టీమిండియాలో హార్ధిక్ పాండ్యాకు చేద్దామనే ఉద్దేశంతోనే సైలెంట్‌గా దూబేను లేపుతున్నాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే.. వాస్తవంగా రోహిత్ అలా ఆలోచించి ఉండకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రోహిత్ అభిమానులతో పాటు, భారత క్రికెట్ అభిమానులు దీన్ని ఆ కోణంలోనే చూస్తున్నారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తీసేసి.. పాండ్యాను కెప్టెన్‌గా చేయడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో పాండ్యాపై విమర్శలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మరి పాండ్యాకు చెక్ పెట్టేందుకు రోహిత్.. దూబేను సిద్ధం చేస్తున్నాడనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shivam Dube said, “Rohit Sharma backed me and said to me that I can do it from any situation” #RohitSharma𓃵 #ShivamDubey pic.twitter.com/0pW9ejb127
— Krishna (@Sigmakrixhna) January 12, 2024
Shivam Dube can bat
Shivam Dubey can BowlRohit Sharma just bought an alternative of chapri Hardik Pandya
Who needs that injury prone when we already have someone like Shivam?#IndvAfg pic.twitter.com/zKBSCGJimG
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 11, 2024