P Venkatesh
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ మధ్య వాగ్వాదం జరిగింది. తొలి సూపర్ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ మధ్య వాగ్వాదం జరిగింది. తొలి సూపర్ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
P Venkatesh
భారత్ – అఫ్గాన్ మధ్య జరిగిన మూడో టీ20 కనీవినీ ఎరుగని రీతిలో ముగిసింది. ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరికి టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ ను భారత్ సమం చేసింది. చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన అఫ్గనిస్తాన్ కూడా మెరుగైన ప్రదర్శన చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. ఇందులో కూడా ఫలితం తేలకపోవడంతో రెండో సూపర్ ఓవర్ కు దారితీసింది. అయితే ఫస్ట్ సూపర్ ఓవర్లో అఫ్గాన్ బ్యాటర్ మహమ్మద్ నబీపై టీమిండియా సారథి ఫైర్ అయ్యాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ మధ్య వాగ్వాదం జరిగింది. తొలి సూపర్ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖేష్ కుమార్ వేసిన బంతికి నబీ షాట్ ఆడబోగా అది కాస్త మిస్ అయ్యింది. దీంతో స్టంప్స్ వెనుక ఉన్న వికెట్ కీపర్ సంజూ శాంసన్ బంతిని అందుకున్నాడు. అయితే ఈ సమయంలో సంజూ బాల్ ను స్టంప్‌లపైకి విసిరేందుకు ప్రయత్నించాడు, కానీ బంతి నబీ కాళ్లకు తగిలి లాంగ్ ఆన్ వైపు వెళ్లింది. దీంతో అఫ్గానిస్థాన్‌కు 2 అదనపు పరుగులు చేసే అవకాశం లభించింది.
చివరి బంతికి 2 పరుగులతో అఫ్ఘానిస్థాన్ సూపర్ ఓవర్‌లో 16 పరుగులు చేసింది. దీనిపై హిట్ మ్యాన్ నబీతో వాగ్వాదానికి దిగాడు. నబి కక్కుర్తిపై రోహిత్ సీరియస్ అయ్యాడు. కాళ్లకు బాల్ తగిలిన తర్వాత బైస్ తీయడంపై ఫైర్ అయ్యారు. బంతి ముఖేష్‌ను చేరుకోకముందే నబీ కాలికి తగిలి లాంగ్ ఆన్ వైపు మళ్లింది. సాధారణంగా, చాలా మంది బ్యాటర్లు అలాంటి పరిస్థితిలో రన్స్ తీయరు. కానీ నబీ కక్కుర్తి పడ్డాడు. అతను రెండవ పరుగు కోసం మాత్రమే కాకుండా మూడవ పరుగును తీసుకున్నాడు. విరాట్ కోహ్లి కూడా తన వద్దకు చేరిన బంతిని ఆపి అది నబీ కాలికి తగిలిందని సైగ చేయడం వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇదీ చదవండి:
వీడియో: కప్పు అందుకోడానికి సూపర్ మ్యాన్‌లా దూసుకొచ్చిన కోహ్లీ!
Rohit Sharma: ఆ సమయంలో రోహిత్ శర్మ.. అశ్విన్‌లా ఆలోచించాడు: ద్రవిడ్
— Nihari Korma (@NihariVsKorma) January 18, 2024