iDreamPost

Rohit Sharma: ఆ సమయంలో రోహిత్‌ శర్మ.. అశ్విన్‌లా ఆలోచించాడు: ద్రవిడ్‌

  • Published Jan 18, 2024 | 11:03 AMUpdated Jan 18, 2024 | 11:03 AM

ఆఫ్ఘనిస్థాన్‌తో బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ.. చేసిన ఒక పని దానికి ద్రవిడ్‌ చేసిన కామెంట్‌ వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘనిస్థాన్‌తో బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్‌ విక్టరీ సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ.. చేసిన ఒక పని దానికి ద్రవిడ్‌ చేసిన కామెంట్‌ వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 18, 2024 | 11:03 AMUpdated Jan 18, 2024 | 11:03 AM
Rohit Sharma: ఆ సమయంలో రోహిత్‌ శర్మ.. అశ్విన్‌లా ఆలోచించాడు: ద్రవిడ్‌

క్రికెట్‌ అభిమానులకు పైసా వసూల మ్యాచ్‌లా మారింది.. బుధవారం భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో 212 పరుగుల స్కోర్‌ సమం కావడం, తర్వాత ఏకంగా రెండు సూపర్‌ ఓవర్లు పడటంతో మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. ఈ మ్యాచ్‌ చూసిన క్రికెట్‌ అభిమానులు చాలా కాలం తర్వాత మరోసారి క్రికెట్‌ మజాను పొందారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏకంగా సెంచరీతో చెలరేగడంతో పాటు.. సూపర్‌ ఓవర్స్‌లో తన సూపర్‌ పవర్‌ ఏంటో చూపించాడు. నిజానికి రోహిత్‌ శర్మనే ఈ మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడని చెప్పాలి. ఎందుకంటే.. సూపర్‌ ఓవర్స్‌లో ఒత్తిడికి కుర్రాళ్లు చిత్తవుతుంటే.. రోహిత్‌ ఒక్కటే సిక్సులతో విరుచుకుపడ్డాడు. విజయానికి, ఆఫ్ఘాన్‌ మధ్య అడ్డుగోడలా నిలబడిపోయాడు. ఈ క్రమంలోనే ఒక సందర్భంలో రోహిత్‌ శర్మ.. టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌లా ఆలోచించాడంటూ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలా ఎందుకన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆ స్కోర్‌ను ఆఫ్ఘనిస్థాన్‌ సమం చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. అయితే.. సూపర్‌ ఓవర్‌లో ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘాన్‌ ఏకంగా 16 పరుగులు రాబట్టింది. ఈ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి రోహిత్‌ శర్మ-జైస్వాల్‌ జోడి దిగింది. తొలి రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో టార్గెట్‌ కష్టమైపోయింది. కానీ, రోహిత్‌ 3, 4 బంతుల్లో అద్భుతమైన షాట్లతో రెండు భారీ సిక్సులు కొట్టాడు. అంతే.. ఇక్వేషన్‌ 2 బంతుల్లో 3 పరుగులుగా మారిపోయింది. కానీ, మళ్లీ 5వ బంతికి సింగిలే రావడంతో.. చివరి బంతికి రెండు రన్స్‌ కావాలి. స్ట్రైక్‌లో జైస్వాల్‌ ఉన్నాడు. రోహిత్‌ నాన్‌స్ట్రైక్‌లో ఉన్నాడు. ఈ టైమ్‌లోనే రోహిత్‌ బుర్ర పాదరసంలా పనిచేసింది.

Rohit turned into Ashwin!

తాను ఎలాగో నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లోనే ఉన్నానని, రెండు పరుగుల కోసం పరిగెత్తాల్సి ఉంది. ఈ టైమ్‌లో తన కంటే వేగంగా పరిగెత్తే ఆటగాడు క్రీజ్‌లో ఉంటే మంచిదని ఆలోచించి.. వెంటనే రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. రోహిత్‌ స్థానంలో రింకూ సింగ్‌ వచ్చాడు. రోహిత్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో అంతా షాక్‌ అయ్యారు. ఆఫ్ఘాన్‌ ఆటగాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అయితే.. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి, మళ్లీ ఫీల్డింగ్‌ చేసి, తర్వాత సూపర్‌ ఓవర్‌ కూడా ఆడిన రోహిత్‌.. తాను అలసిపోయాయని, తన స్థానంలో రింకూ అయితే వేగంగా పరిగెత్తుతాడని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. కానీ, జైస్వాల్‌ చివరి బంతికి సింగిల్‌ మాత్రమే తీయడంతో మ్యాచ్‌ మళ్లీ టైగా ముగిసింది.

అయితే.. రోహిత్‌ గ్రౌండ్‌ నుంచి బయటికి రావాలనే నిర్ణయాన్ని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. అశ్విన్‌ లెవెల్‌ ఆఫ్‌ థింకింగ్‌గా అభివర్ణించాడు. సాధారణంగా అశ్విన్‌ చెస్‌ బాగా ఆడుతుంటాడు. అతనిది మాస్టర్‌ మైండ్‌ అని కూడా చాలా మంది అంటుంటారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఒక బాల్‌ను అశ్విన్‌ చాలా తెలివిగా దాన్ని అలానే పోనిస్తాడు. అది టీమిండియా విజయానికి ఎంతో హెల్ప్‌ చేసింది. ఎంత ఒత్తిడిలో ఉన్నా అశ్విన్‌ మైండ్‌ చాలా బాగా పనిచేస్తుందని, ఇప్పుడు రోహిత్‌ కూడా అశ్విన్‌లానే ఆలోచించాడంటూ ద్రవిడ్‌ సరదాగా పేర్కొన్నాడు. మరి ద్రవిడ్‌.. రోహిత్‌ గురించి ఇలా చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి