iDreamPost
android-app
ios-app

వీడియో: కప్పు అందుకోడానికి సూపర్‌ మ్యాన్‌లా దూసుకొచ్చిన కోహ్లీ!

  • Published Jan 18, 2024 | 12:45 PM Updated Updated Jan 18, 2024 | 12:45 PM

భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు రావడం ఆసక్తి రేకెత్తించింది. ఈ మ్యాచ్ లో హోరాహోరీగా పోరాడిన భారత్ విజయం సాధించింది. కప్పు అందుకునే సమయంలో కోహ్లీ సూపర్ మ్యాన్ లా మారాడు.

భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు రావడం ఆసక్తి రేకెత్తించింది. ఈ మ్యాచ్ లో హోరాహోరీగా పోరాడిన భారత్ విజయం సాధించింది. కప్పు అందుకునే సమయంలో కోహ్లీ సూపర్ మ్యాన్ లా మారాడు.

  • Published Jan 18, 2024 | 12:45 PMUpdated Jan 18, 2024 | 12:45 PM
వీడియో: కప్పు అందుకోడానికి సూపర్‌ మ్యాన్‌లా దూసుకొచ్చిన కోహ్లీ!

టీమిండియా- ఆఫ్గాన్ ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ క్రికెట్ ప్రియులకు కావాల్సిన జోష్ అందించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా విజయ ఢంకా మోగించింది. మూడు టీ20 సిరీస్ లలో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా మూడో టీ20లో నెగ్గి క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఆరంభంలోనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆతర్వాత రోహిత్, రింకూ సింగ్ మెరుపు బ్యాటింగ్ తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ విన్ అయిన అనంతరం కప్ అందుకునే సమయంలో భారత స్టార్ బ్యాటర్ సూపర్ మ్యాన్ అవతారమెత్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీమిండియా దిగ్గజ ఆటగాడు గ్రౌండ్ లో చురుకుగా ఉంటూ తన హావభావాలతో ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటాడు. బ్యాటింగ్ తోనే కాకుండా అప్పుడప్పుడు స్టెప్పులేస్తూ అభిమానులను ఉత్సాహపరుస్తుంటాడు. మంచి నీళ్లు తాగినంతా ఈజీగా సెంచరీలు సాధిస్తూ పరుగుల వీరుడిగా పేరుతెచ్చుకున్న కోహ్లీ అఫ్గాన్ పై భారత్ విన్ అయిన తర్వాత గ్రౌండ్ లో సూపర్ మ్యాన్ లా విన్యాసాలు చేశాడు. ఇది చూసిన కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

విన్నింగ్ సెలబ్రేషన్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ మైదానంలోని గ్రాస్ పై జారుకుంటూ వచ్చి సూపర్ మ్యాన్ లా ఎంట్రీ ఇచ్చాడు. జట్టుతో కలిసి కప్ అందుకుని ఫొటో దిగారు. గ్రౌండ్ లో చిన్న పిల్లాడిలా మారి కోహ్లీ చేసిన పనికి ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన విషయం తెలిసిందే. గోల్డెన్ డక్ గా వెనుదిరిగి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. మరి గ్రౌండ్ లో సూపర్ మ్యాన్ అవతారమెత్తిన కోహ్లీ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom