Nidhan
ICC Test Rankings, Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. ర్యాంకింగ్స్‌లో అతడు హవా నడిపిస్తున్నాడు. ఒక్క ఫార్మాట్ అనేం లేదు.. అన్నింటి ర్యాంకింగ్స్‌లోనూ భారత సారథి దూసుకెళ్తున్నాడు.
ICC Test Rankings, Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. ర్యాంకింగ్స్‌లో అతడు హవా నడిపిస్తున్నాడు. ఒక్క ఫార్మాట్ అనేం లేదు.. అన్నింటి ర్యాంకింగ్స్‌లోనూ భారత సారథి దూసుకెళ్తున్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ అతడు మరింత రాటుదేలుతున్నాడు. బ్యాట్‌ను మంత్రదండంలా మార్చి మ్యాజిక్ చేస్తున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. పొట్టి వరల్డ్ కప్‌తో టీ20లకు గ్రాండ్‌గా వీడ్కోలు చెప్పిన హిట్‌మ్యాన్.. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ అతడి హవా నడుస్తోంది. ముఖ్యంగా ర్యాంకింగ్స్‌లో భారత సారథి జోరు భలేగా ఉంది. తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చాడు హిట్‌మ్యాన్. అతడు ఏ ర్యాంక్‌లో నిలిచాడు? రోహిత్‌తో పాటు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన భారత ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ తిరిగి టాప్-5లోకి వచ్చాడు. 751 రేటింగ్ పాయింట్స్‌తో ఉన్న హిట్‌మ్యాన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం టెస్టులతో పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ రోహితే కావడం విశేషం. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇతర భారత ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరో స్థానంలో నిలిచాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని ఏడో ప్లేస్‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో సెంచరీ బాదిన శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంక ఏకంగా 42 స్థానాలు ఎగబాకాడు. ఈ లంక స్టార్ 39వ ప్లేస్‌లో నిలిచాడు.
టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ జోరు కొనసాగుతోంది. అతడు టాప్‌లో కంటిన్యూ అవుతున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్స్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వారి తర్వాతి ప్లేస్‌లో ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో పెద్దగా ఛేంజెస్ లేవు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్వుడ్తో కలసి పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియా ఆరు నెలల గ్యాప్ తర్వాత టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19 నుంచి మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటుంది. కాబట్టి ఈ సిరీస్‌తో ర్యాంకింగ్స్‌లో రోహిత్ మరింత దూకుడు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. హిట్‌మ్యాన్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి తిరిగి రావడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Rohit in ODI batters ranking – 2
Rohit in Test batters ranking – 5Rohit Sharma is the only batter currently in the Top 5 in ODI & Test ranking.
– HITMAN IS RULING AT THE AGE OF 37. 🫡 pic.twitter.com/DuqhIhbtCH
— Johns. (@CricCrazyJohns) September 11, 2024