SNP
Rohit Sharma, IND vs BAN: రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌కి ముందు బంగ్లాదేశ్ జట్టు రోహిత్ శర్మ చూసి భయపడుతోంది. ఆ టీమ్‌లో అంత భయానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Rohit Sharma, IND vs BAN: రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌కి ముందు బంగ్లాదేశ్ జట్టు రోహిత్ శర్మ చూసి భయపడుతోంది. ఆ టీమ్‌లో అంత భయానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీ20 వరల్డ్ కప్ విజయం, శ్రీలంకపై వన్డే సిరీస్ ఓటమి మర్చిపోయి.. టీమిండియా బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడాలంటే.. టీమిండియాకు బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఎంతో కీలకం. అందుకే బీసీసీఐ, రోహిత్ సేన ఈ సిరీస్‌పై గట్టి ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే భారత సెలెక్టర్లు తొలి టెస్ట్ కోసం స్క్వౌడ్‌ను ప్రకటించారు. ఈ నెల 19 నుంచి భారత్-బంగ్లాదేశ్ నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు బంగ్లాదేశ్ మంచి జోష్‌లో ఉంది. పాకిస్థాన్‌ను వాళ్ల దేశంలోనే వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి.. తొలిసారి పాకిస్థాన్‌ను వైట్‌వాష్ చేసింది. అదే ఆటతీరును టీమిండియాపై కూడా చూపిస్తామని ఇప్పటికే బంగ్లాదేశ్ కెప్టెన్ ప్రకటించాడు.
తొలి టెస్టు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. అయితే.. ఈ టెస్ట్ కంటే ముందు టీమిండియాను ఒక విషయం భయపెడుతోంది. అదే స్పిన్ ట్రాక్. చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందనే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒక వేళ ఆ పిచ్‌పై బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగితే.. టీమిండియాను ఆదుకోవడానికి ఒకే ఒక్కడు కనిపిస్తున్నాడు ఆ ఒక్కడే భారత కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ.. పిచ్‌పై బాల్ టర్న్ అయితే కోహ్లీ కాస్త ఇబ్బంది పడుతుంటాడు. శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ స్పిన్నర్లకే అవుట్ అయ్యాడు. చెన్నై పిచ్‌పై కూడా బంగ్లా స్పిన్నర్లు కోహ్లీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
ఇక విరాట్ కోహ్లీ కాకుండా టీమిండియా ఎవరిపై అంతా ఆధారపడే అవకాశం లేదు. కానీ, బంగ్లాదేశ్ స్పిన్నర్లు చెలరేగినా.. భారత జట్టును రక్షించేందుకు రోహిత్ శర్మ అనే ఒక ఆపద్బాంధవుడు ఉన్నాడని బంగ్లాదేశ్ కూడా భయపడుతోంది. చెన్నై పిచ్ ఒక వేళ స్పిన్‌కు అనుకూలిస్తే.. భారత స్పిన్ బౌలర్ల కూడా చెలరేగే అవకాశం ఉంది. అలాంటి టైమ్‌లో తాము బ్యాటింగ్‌లో నిలదొక్కుకోలేకపోయినా.. బౌలింగ్‌లోనైనా టీమిండియా ఇబ్బంది పెడదామంటే.. రోహిత్ శర్మ రూపంలో టీమిండియాకు అదనపు బలం ఉంది. రోహిత్ ఎంత విధ్వంసకర బ్యాటరో.. అంతే అద్భుతంగా మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడగలడు. ముఖ్యంగా స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. స్పిన్‌ను కట్ చేయడానికి స్వీప్ షాట్లు ఆడతాడు. అది రోహిత్ చాలా ప్లస్ అవుతూ ఉంటుంది.
శ్రీలంకతో జరిగిన మూడో సిరీస్‌లోనూ రోహిత్ శర్మ బాగానే రాణించాడు. స్విప్ షాట్లతో అలరించాడు. లంకపై రోహిత్ చేసిన బ్యాటింగ్ చూసే.. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భయపెడుతోంది. ఇక ఒక్క బ్యాటింగ్ అనే కాదు.. కెప్టెన్‌గా కూడా రోహిత్ స్ట్రాటజీని అంచనా వేయడం కష్టమనే ఆందోళనలో ఉంది బంగ్లాదేశ్. పాకిస్థాన్‌పై ఆడిన విధంగానే టీమిండియాపై కూడా ఆడతాం అంటూ బంగ్లా కెప్టెన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల భయం మాత్రం ఉంది. ఎందుకంటే.. టీమిండియా కెప్టెన్‌గా ఉంది రోహిత్ శర్మ కాబట్టి. టీమిండియా అంటే పాకిస్థాన్‌లా ఉండదు పరిస్థితి. మ్యాచ్ కోసం ప్రాణం పెట్టేస్తారు.. యువ క్రికెటర్ల నుంచి హండ్రెడ్ పర్సంట్ తీసుకోవడంలో రోహిత్ దిట్ట. తన మాటలతో, ఆటతో యువ క్రికెటర్లలో స్ఫూర్తి నింపుతూ.. తానూ కోహ్లీ విఫలమైనా.. పంత్‌ను అడ్డుపెట్టి కూడా బంగ్లాను ఓడించే సత్తా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకే.. టీమిండియా బలం.. బంగ్లాదేశ్‌కు భయంగా మారుతున్నాడు రోహిత్. మరి బంగ్లాదేశ్ సిరీస్‌లో రోహిత్ ఎలాంటి ప్రభావం చూపుతాడని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit in ODI batters ranking – 2
Rohit in Test batters ranking – 5Rohit Sharma is the only batter currently in the Top 5 in ODI & Test ranking.
– HITMAN IS RULING AT THE AGE OF 37. 🫡 pic.twitter.com/DuqhIhbtCH
— Johns. (@CricCrazyJohns) September 11, 2024