iDreamPost
android-app
ios-app

ICC ర్యాంకింగ్స్​లో రోహిత్ హవా.. టాప్​-5లోకి హిట్​మ్యాన్ ఎంట్రీ!

  • Published Sep 11, 2024 | 8:02 PM Updated Updated Sep 11, 2024 | 8:02 PM

ICC Test Rankings, Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. ర్యాంకింగ్స్​లో అతడు హవా నడిపిస్తున్నాడు. ఒక్క ఫార్మాట్ అనేం లేదు.. అన్నింటి ర్యాంకింగ్స్​లోనూ భారత సారథి దూసుకెళ్తున్నాడు.

ICC Test Rankings, Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. ర్యాంకింగ్స్​లో అతడు హవా నడిపిస్తున్నాడు. ఒక్క ఫార్మాట్ అనేం లేదు.. అన్నింటి ర్యాంకింగ్స్​లోనూ భారత సారథి దూసుకెళ్తున్నాడు.

  • Published Sep 11, 2024 | 8:02 PMUpdated Sep 11, 2024 | 8:02 PM
ICC ర్యాంకింగ్స్​లో రోహిత్ హవా.. టాప్​-5లోకి హిట్​మ్యాన్ ఎంట్రీ!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడు మామూలుగా లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ అతడు మరింత రాటుదేలుతున్నాడు. బ్యాట్​ను మంత్రదండంలా మార్చి మ్యాజిక్ చేస్తున్నాడు. ఫార్మాట్​తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. పొట్టి వరల్డ్ కప్​తో టీ20లకు గ్రాండ్​గా వీడ్కోలు చెప్పిన హిట్​మ్యాన్.. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతున్నాడు. ఈ రెండు ఫార్మాట్లలోనూ అతడి హవా నడుస్తోంది. ముఖ్యంగా ర్యాంకింగ్స్​లో భారత సారథి జోరు భలేగా ఉంది. తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​ను ప్రకటించింది. ఇందులో టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చాడు హిట్​మ్యాన్. అతడు ఏ ర్యాంక్​లో నిలిచాడు? రోహిత్​తో పాటు ర్యాంకింగ్స్​లో సత్తా చాటిన భారత ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్​లో రోహిత్ తిరిగి టాప్-5లోకి వచ్చాడు. 751 రేటింగ్ పాయింట్స్​తో ఉన్న హిట్​మ్యాన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం టెస్టులతో పాటు వన్డే ర్యాంకింగ్స్​లో టాప్-5లో ఉన్న ఏకైక బ్యాటర్ రోహితే కావడం విశేషం. టెస్ట్ ర్యాంకింగ్స్​లో ఇతర భారత ఆటగాళ్లు కూడా సత్తా చాటారు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరో స్థానంలో నిలిచాడు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఒక స్థానం మెరుగుపర్చుకొని ఏడో ప్లేస్​లో నిలిచాడు. ఇంగ్లండ్​తో జరిగిన మూడో టెస్ట్​లో సెంచరీ బాదిన శ్రీలంక బ్యాటర్ పతుమ్ నిస్సంక ఏకంగా 42 స్థానాలు ఎగబాకాడు. ఈ లంక స్టార్ 39వ ప్లేస్​లో నిలిచాడు.

టెస్ట్ ర్యాంకింగ్స్​లో ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ జోరు కొనసాగుతోంది. అతడు టాప్​లో కంటిన్యూ అవుతున్నాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్స్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వారి తర్వాతి ప్లేస్​లో ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్​లో పెద్దగా ఛేంజెస్ లేవు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ ప్లేస్​లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజల్​వుడ్​తో కలసి పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో, చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 15వ స్థానంలో కొనసాగుతున్నారు. టీమిండియా ఆరు నెలల గ్యాప్ తర్వాత టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్​తో ఈ నెల 19 నుంచి మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్​లో పాల్గొంటుంది. కాబట్టి ఈ సిరీస్​తో ర్యాంకింగ్స్​లో రోహిత్ మరింత దూకుడు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. హిట్​మ్యాన్ టెస్ట్ ర్యాంకింగ్స్​లో టాప్-5లోకి తిరిగి రావడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.