iDreamPost
android-app
ios-app

కోహ్లీని డామినేట్ చేస్తున్న రోహిత్! ఇన్నాళ్లకు సాధ్యం అయ్యిందా?

వరల్డ్ కప్ లో టీమిండియా దూకుడు కొనసాగుతూనే ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ- విరాట్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు అని వినిపిస్తున్న కామెంట్స్ లో నిజమెంత?

వరల్డ్ కప్ లో టీమిండియా దూకుడు కొనసాగుతూనే ఉంది. మరోవైపు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ- విరాట్ పై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు అని వినిపిస్తున్న కామెంట్స్ లో నిజమెంత?

కోహ్లీని డామినేట్ చేస్తున్న రోహిత్! ఇన్నాళ్లకు సాధ్యం అయ్యిందా?

విరాట్ కోహ్లీ.. క్రికెట్ లో కింగ్ కోహ్లీగా కొనసాగుతున్నాడు. కోహ్లీ క్రియేట్ చేయని రికార్డులు లేవు, కోహ్లీ బ్రేక్ చేయని రికార్డులూ లేవు. దాదాపు ఏ ఆటగాడికి సాధ్యంకాని కొన్ని అరుదైన రికార్డులను కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ ఎరాలో విరాట్ కోహ్లీని మించిన క్రికెటర్ టీమిండియాలో ఉండరు అనేది కూడా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆట అంత దూకుడుగా ఉంటుంది. ఇప్పటికీ కోహ్లీ అదే దూకుడుతో కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ.. కోహ్లీపైనే పైచేయి సాధించాడు. కింగ్ కోహ్లీపై రోహిత్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు.

రోహిత్ శర్మకు భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ, కోహ్లీతో పోలిక వచ్చే సరికి కింగ్ కోహ్లీనే ఒకింత పైచేయి ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. కోహ్లీ దూకుడు కూడా అలాగే ఉంటుంది. కానీ, వరల్డ్ కప్ 2023 ప్రారంభమైనప్పటి నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ దూకుడు పెంచాడు. అది కూడా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్న ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ కూడా ఈ తరహా ప్రదర్శన చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో అయితే కోహ్లీ ఉండగా మరో ఆటగాడు ప్రేక్షకుల దృష్టిలో పడేవాడు కాదు.

కానీ, ఇప్పుడు రోహిత్ శర్మాపై క్రికెట్ అభిమానులు, స్పోర్ట్స్ అనలిస్టులు, మాజీ దిగ్గజాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ ఆటను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు కోహ్లీ కూడా అంతే అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే దీన్నంతా కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య ఆధిపత్య పోరు అనడం కరెక్ట్ కాదు. ఇద్దరు స్టార్ ప్లేయర్లు అద్భుతంగా రాణించడం వల్ల టీమ్ కి కలిగే ప్రయోజనం గురించి ఆలోచించాలి. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలో రోహిత్, కోహ్లీ ప్రదర్శన టీమిండియాకు ఎంతో శుభపరిణామం అనే చెప్పాలి. వీళ్లిద్దరు ఎంతో నిలకడగా ఆడుతున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో క్రీజులో నిలదొక్కుకుని మంచి గణాంకాలను నమోదు చేస్తున్నారు. ఒక మ్యాచ్ లో రోహిత్ తడబడితే కోహ్లీ నిలదొక్కుకోవడం, కోహ్లీలేని సమయంలో రోహిత్ శర్మ ఆచితూచి ఆడటం అందరినీ ఆకట్టుకుంటోన్న అంశం.

విరాట్- రోహిత్ దూకుడు ఇలాగే కొనసాగితే టీమిండియా ఆధిపత్యాన్ని ఆపే జట్టు ఉండదనే చెప్పాలి. మరోవైపు వరల్డ్ కప్ టీమిండియా జట్టు పరాజయం లేకుండా అప్రతిహితంగా కొనసాగుతోంది. ఆడిన 6 మ్యాచుల్లో 6 విజయాలు నమోదు చేసింది. 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆస్ట్రిలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇలా జట్టు మారుతోంది గానీ.. రిజల్ట్ మాత్రం మారడం లేదు. ప్రతి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయాలను నమోదు చేస్తోంది. మరి.. విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మ దూకుడుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి