iDreamPost
android-app
ios-app

వీడియో: ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్‌ శర్మ భావోద్వేగం! ఆ ఇద్దరి వల్లే అంటూ..

  • Author Soma Sekhar Published - 03:43 PM, Mon - 20 November 23

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమితో.. ఆటగాళ్లతో పాటుగా దేశం మెుత్తం శోకసంద్రంలో మునిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఓటమికి కారణాలను చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్.

వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమితో.. ఆటగాళ్లతో పాటుగా దేశం మెుత్తం శోకసంద్రంలో మునిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఓటమికి కారణాలను చెప్పుకొచ్చాడు కెప్టెన్ రోహిత్.

  • Author Soma Sekhar Published - 03:43 PM, Mon - 20 November 23
వీడియో: ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్‌ శర్మ భావోద్వేగం! ఆ ఇద్దరి వల్లే అంటూ..

వరల్డ్ కప్ 2023లో అద్వితీయమైన ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. తుది సమరంలో బోల్తాపడింది. మూచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ ను ముద్దాడాలని చూసిన భారత్ ఆశలపై కంగారూ టీమ్ నీళ్లు చల్లింది. ఫైనల్ మ్యాచ్ లో ఇటు బ్యాటింగ్ లో, అటు బౌలింగ్ లో తడబడటంతో.. వరల్డ్ కప్ టైటిల్ ను అందుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. తమ ఓటమికి కారణాలను చెప్పుకొచ్చాడు. ఆ ఇద్దరి వల్లే ఓడిపోయాం అంటూ.. ఎమోషనల్ అయ్యాడు.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసి ప్రతీ భారతీయుడి గుండె బరువెక్కింది. ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడాన్ని ఇండియన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ ఉద్యోగి ఏకంగా ఈ ఓటమిని భరించలేక గుండె ఆగి మరణించాడు. మరికొన్ని గుండెలు చమర్చాయి కూడా. కాగా.. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు. రోహిత్ మాట్లాడుతూ..

“ఫైనల్ మ్యాచ్ లో మా ప్రదర్శన అంత గొప్పగా లేదు. దీంతో ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. అయితే ప్రపంచ కప్ లో టీమ్ ఆటతీరు పట్ల గర్వపడుతున్నా. ఈ మ్యాచ్ లో ఇంకో 20-30 పరుగులు చేస్తే.. ఫలితం వేరేలా ఉండేది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జట్టు స్కోర్ 270-280 పరుగులు దాటుతుందని అనుకున్నాం. కానీ వరుసగా వికెట్లు పడటంతో.. 240 రన్స్ కే మేం పరిమితం అయ్యాం. అయితే మా ప్లాన్ ప్రకారంమే ప్రత్యర్థి మూడు వికెట్లు పడగొట్టాం. కానీ ట్రావిస్ హెడ్-లబూషేన్ జోడీ టీమిండియా విజయావకాశాలను దెబ్బతీశారు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగానే మేం ఓడిపోయాం” అంటూ భావోద్వేగానికి లోనైయ్యాడు రోహిత్.

కాగా.. ఈ పరాజయానికి ఇదే కారణం మేం సాకుగా చెప్పడం లేదు.. మా బ్యాటింగ్ కూడా ఈ మ్యాచ్ లో బాలేదని టీమిండియా కెప్టెన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 రన్స్ కు ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జట్టులో ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్ లతో 137 పరుగులతో చెలరేగడంతో.. ఆసీస్ వరల్డ్ కప్ ను ముద్దాడింది. అతడికి అండగా.. మార్నస్ లబూషేన్ 110 బంతుల్లో 4 ఫోర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 50 రన్స్ లోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆసీస్ ను వీరిద్దరి భాగస్వామ్యాం నిలబెట్టింది. దీంతో ఆస్ట్రేలియా సునాయస విజయం సాధించి.. వరల్డ్ కప్ ఎగరేసుకుపోయింది.