iDreamPost
android-app
ios-app

రోహిత్ శర్మ క్రేజీ రికార్డు.. పాకిస్థాన్ పరువు తీసేశాడుగా!

  • Author Soma Sekhar Updated - 06:29 PM, Fri - 20 October 23

రోహిత్ శర్మ బ్యాటింగ్ దాటికి రికార్డులు షేకవుతున్నాయి. ఈసారి ఏకంగా క్రికెట్ టీమ్స్ సాధించలేని రికార్డు సాధించి.. ఔరా అనిపించాడు హిట్ మ్యాన్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోహిత్ శర్మ బ్యాటింగ్ దాటికి రికార్డులు షేకవుతున్నాయి. ఈసారి ఏకంగా క్రికెట్ టీమ్స్ సాధించలేని రికార్డు సాధించి.. ఔరా అనిపించాడు హిట్ మ్యాన్. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Updated - 06:29 PM, Fri - 20 October 23
రోహిత్ శర్మ క్రేజీ రికార్డు.. పాకిస్థాన్ పరువు తీసేశాడుగా!

వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని సెమీస్ స్థానానికి మరింతగా చేరువగా వచ్చింది. ఇక ఈ టోర్నీలో టీమిండియా బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఒకరిని మించి మరోకరు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. దూసుకెళ్తున్నారు. వీరిద్దరి ధాటికి రికార్డులు షేక్ అవుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పలు రికార్డులను బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. అయితే ఇప్పటి వరకు ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్.. తాజాగా ప్రపంచ కప్ జట్లు సాధించలేని రికార్డు సాధించి.. ఔరా అనిపించాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా వరల్డ్ రికార్డు సాధించాడు టీమిండియా సారథి. అదీకాక ఈ రికార్డ్ తో పాక్ పరువు తీసేశాడు హిట్ మ్యాన్. మరి ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ.. ఈ పేరు చెప్పగానే రికార్డులు షేకవుతున్నాయి. దానికి కారణం అతడు కంటిన్యూస్ గా బద్దలు కొడుతున్న రికార్డులే. గత కొంతకాలంగా టీమిండియా సారథి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. నిలకడగా రాణిస్తూ.. జట్టుకు విజయాలను అందించడమే కాకుండా పలు ఘనతలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ హిట్ మ్యాన్. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ తో పలు రికార్డులను బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. ప్రపంచ కప్ లో జట్లు సాధించలేని రికార్డును సాధించాడు టీమిండియా సారథి. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో జరిగిన వన్డేల్లో తొలి 10 ఓవర్లలో అత్యధిక సిక్స్ లు కొట్టిన ఏకైక ప్లేయర్ గా ఘనతకెక్కాడు. రోహిత్ శర్మ ఒక్కడే 32 సిక్స్ లు కొట్టగా.. మిగిలిన జట్లు ఏవీ కూడా అన్ని సిక్స్ లు బాదలేదు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? తొలి 10 ఓవర్లలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన వన్డేల్లో పాకిస్థాన్ జట్టు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోవడం గమనార్హం. దీంతో హిట్ మ్యాన్ పాక్ పరువు తీస్తూ.. ఈ రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

కాగా.. ఈ రికార్డే కాకుండా రోహిత్ ఖాతాలో మరికొన్ని ఘనతలు కూడా వచ్చి చేరాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సిక్స్ లు కొట్టిన కెప్టెన్ గా నిలిచాడు రోహిత్. కెప్టెన్ గా 61 సిక్స్ లు బాదాడు హిట్ మ్యాన్. అలాగే వన్డే వరల్డ్ కప్ లో ఛేజింగ్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గానూ రోహిత్ రికార్డు క్రియేట్ చేశాడు. వీటితోపాటుగా ఆసియా గడ్డపై జరిగిన వన్డే మ్యాచ్ ల్లో 6వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడికి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. మరి రోహిత్ శర్మ బ్రేక్ చేసిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.